Skip to content

రష్మిక మందన్న ‘మైసా’ నవంబర్ 27న రిలీజ్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కెరీర్‌లో ప్రతిష్టాత్మక పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'మైసా'లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో గోండ్ గిరిజన మహిళ పాత్ర పోషిస్తున్న రష్మిక , ఆ పాత్రలో ఒదిగిపొవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న'మైసా' ఆకట్టుకునే ఫస్ట్ గ్లింప్స్‌తో ఇప్పటికే ఆసక్తిని రేకెత్తించింది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 27, 2026న ‘మైసా’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. పోస్టర్‌లో రష్మిక ఒక పెద్ద ఈటె పట్టుకుని నిలబడి ఉండగా, ఆమె ముఖంపై యుద్ధ గాయాలు కనిపిస్తాయి. ఆమె వెనుక భారీ జనసమూహం, మండుతున్న పరిసరాలు ఇంటెన్స్ గా ఉన్నాయి. ఈ పోస్టర్‌కు స్ట్రాంగ్ పీరియడ్-యాక్షన్ లుక్…

Read more

‘మారెమ్మ’ ట్రైలర్ అద్భుతంగా ఉంది : దర్శకుడు శివ నిర్వాణ

‘మారెమ్మ’ సినిమాతో పరిచయం కావడం ఆనందంగా ఉంది. మారెమ్మ చూసి రవితేజ గారు చాలా ఎమోషనల్ అయ్యారు. మీ అందరి సపోర్ట్ ఉంటే హిట్ కొట్టేద్దాం: హీరో మాధవ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లాంచ్ చేసిన మాధవ్, మంచాల నాగరాజ్, మయూర్ రెడ్డి బండారు, మోక్ష ఆర్ట్స్ ‘మారెమ్మ’ ట్రైలర్ మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా 'మారెమ్మ'తో హీరోగా పరిచయం అవుతున్నారు. మంచాల నాగరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మోక్ష ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మయూర్ రెడ్డి బండారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, పాటలు కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్…

Read more

‘ఐయామ్ గేమ్’ మీ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది: హీరో దుల్కర్ సల్మాన్

‘ఐయామ్ గేమ్’ చూశాను. చాలా ఎంటర్టైన్‌మెంట్ ఉంటుంది. ఇందులోని కాన్సెప్ట్‌కు మీరందరూ సర్‌ప్రైజ్ అవుతారు: డైరెక్టర్ నాగ్ అశ్విన్ దుల్కర్ సల్మాన్ భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’ . మెగా బ్లాక్‌బస్టర్ ‘లోకా చాప్టర్ 1: చంద్ర’ తర్వాత వే ఫేరర్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న ఈ చిత్రాన్ని సూపర్‌హిట్ ‘RDX’ ఫేం నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సెప్టెంబర్ 3న గ్రాండ్ గా విడుదల చేయనుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు విజనరీ డైరెక్టర్…

Read more

#NBK111 సెప్టెంబర్ 6న టైటిల్ అనౌన్స్‌మెంట్

గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు గోపీచంద్ మలినేని మోస్ట్ ఎవైటెడ్ మూవీ #NBK111 కోసం మరోసారి జతకట్టారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీగా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజున విడుదలైన "ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా" ఫస్ట్ గ్లింప్స్‌తో భారీ అంచనాలు రేకెత్తించింది. బాలయ్య పవర్ ఫుల్ అవతార్‌లో అదరగొట్టారు. #NBK111 నుంచి మరో పెద్ద అప్‌డేట్ రాబోతోంది. చిత్ర నిర్మాతలు సెప్టెంబర్ 6వ తేదీన టైటిల్, విడుదల తేదీని ప్రకటించనున్నారు. గ్లింప్స్ విడుదలైనప్పటి నుండి ప్రేక్షకులు ఈ సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'వీర సింహారెడ్డి' వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ కావడంతో మరిన్ని…

Read more

‘కూర్మ అవతార్’ సినిమాలో భాగం కావడం అదృష్టం: శివరాజ్ కుమార్

కూర్మ అవతార్ టీజర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ నిర్మాత దిల్ రాజు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ప్రధాన పాత్రలో హర్ష వర్ధన్ కడియాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కూర్మ అవతార్'. నరేంద్ర కొండ సమర్పణలో పంచవక్త్ర పిక్చర్స్ & రుక్వీణ స్టూడియోస్ బ్యానర్స్ పై పూజిత, సేవిత నిర్మిస్తున్నారు. రాజ్ తరుణ్, వరలక్ష్మి శరత్‌కుమార్, సాయి కుమార్, శివాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రోజు మేకర్స్ ఈ సినిమా టీజర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీజర్ లాంచ్ ఈవెంట్…

Read more

వరల్డ్‌వైడ్‌గా రూ.150 కోట్లు దాటిన ‘ఇరుముడి’ గ్రాస్

మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కొనసాగిస్తోంది. అద్భుతమైన వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమా రెండో వారంలోనూ స్ట్రాంగ్ కలెక్షన్స్ నమోదు చేస్తోంది. వీకెండ్‌లో వసూళ్లు మరింతగా పెరిగాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తన జోరును కొనసాగిస్తోంది. ఇప్పటికే ‘ఇరుముడి’ వరల్డ్‌వైడ్‌గా రూ.150 కోట్ల గ్రాస్ మార్క్‌ను క్రాస్ చేసింది. రవితేజ కెరీర్‌లో ఇదొక మైలురాయి కావడం విశేషం. ఈ సెన్సేషనల్ రన్‌లో నైజాం ఏరియా కీలకంగా నిలిచింది. అక్కడ రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. మిగతా ఏరియాల్లోనూ సినిమా ఇంప్రెసివ్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ముఖ్యంగా రీజినల్ సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా ‘ఇరుముడి’ నిలిచింది. అలాగే నిర్మాతలు,…

Read more

‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ సెప్టెంబర్ 4న తెలుగులో రిలీజ్

నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’. ‘ప్రేమలు’ ఫేమ్ గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల మలయాళంలో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ లో ఫన్ లవ్ ఎంటర్ టైమెంట్ అదిరిపోయింది. నివిన్ పౌలీ జస్టిన్ పాత్రలో కనిపించారు. 2005లో ఆన్‌లైన్‌లో క్యాసెట్ పాటలను కన్వర్ట్ చేసి అప్‌లోడ్ చేస్తూ తనకు తానే ‘MP3King’ అనే పేరు పెట్టుకున్న జస్టిన్ పాత్రలో పరిచయం కావడం ఆకట్టుకుంది. మమితా బైజు కాలేజీ విద్యార్థినిగా, గిటార్…

Read more

‘ది ప్యారడైజ్’ నుంచి ‘యెష నాగుల’ సాంగ్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా యాక్షన్ ఎక్స్‌ట్రావ్యాగెంజా ‘ది ప్యారడైజ్’ ఇప్పటికే పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’, ఇటీవల విడుదలైన టీజర్‌తో భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘ఆయా షేర్’ కు వచ్చిన అద్భుతమైన స్పందన తర్వాత మేకర్స్ ‘యెష నాగుల’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జానపద బాణీకి అనిరుధ్ తనదైన హై-ఎనర్జీ మ్యూజిక్‌ను జోడించిన ఈ పాటను డల్లాస్‌లో జరిగిన అనిరుధ్ కాన్సర్ట్‌లో లైవ్‌గా విడుదల చేశారు. వేలాది మంది అభిమానుల మధ్య పాటను లైవ్‌లో ప్రదర్శించగా, ప్రేక్షకులు డ్యాన్స్ చేస్తూ,…

Read more

‘బిల్లా రంగా బాషా: ది ఫస్ట్ బ్లడ్’ సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీ

సూపర్‌స్టార్ బాద్‌షా కిచ్చా సుదీప్ ప్రతిష్టాత్మక పీరియడ్-యాక్షన్ స్పెక్టకిల్ ‘బిల్లా రంగా బాషా: ది ఫస్ట్ బ్లడ్’ థియేట్రికల్ రిలీజ్ దిశగా యూనిక్ ప్లానింగ్‌తో ముందుకు సాగుతోంది. అనూప్ భండారి దర్శకత్వం వహిస్తున్న ఈ హై-బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ వినూత్నమైన ప్రమోషనల్ క్యాలెండర్‌ను ప్రకటించారు. ఈ ప్రమోషనల్ క్యాంపెయిన్ 2026 సెప్టెంబర్ 2 నుంచి 2027 చివరి క్యార్టర్లో సినిమా విడుదలయ్యే వరకు కొనసాగనుంది. సుదీప్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2, 2026న ఈ ప్రచార కార్యక్రమం అధికారికంగా ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించనున్నారు. తాజాగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్…

Read more

నాగార్జున మైల్‌స్టోన్ మూవీ కి ‘కింగ్ 100’ టైటిల్

కింగ్ నాగార్జున మైల్‌స్టోన్ 100వ చిత్రం #కింగ్ 100, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో, రా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా పవర్‌ఫుల్ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. నాగార్జున వాయిస్‌ఓవర్‌తో ప్రారంభమయ్యే గ్లింప్స్‌లో సమాజం మనుషులను వారి సంపద ఆధారంగా ఎలా విభజిస్తుందనే అంశాన్ని ఆసక్తికరంగా ప్రస్తావించారు. తన దగ్గర ఏమీ లేనప్పుడు తనను ‘లూజర్’ అని పిలిచారని, అదే సంపద సంపాదించిన తర్వాత ‘ది కింగ్’ అని పిలుస్తున్నారని నాగార్జున చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. మరోవైపు నాగార్జున ఫొటోతో పాటు రూ.50,000 కోట్ల భారీ స్కామ్‌కు సంబంధించిన వార్తను చూపించడం సినిమాపై మరింత ఆసక్తిని…

Read more