Skip to content

గోపీచంద్ ‘సింగ’ 50 శాతం షూటింగ్ పూర్తి

టి. గోపీచంద్ ప్రతిష్టాత్మక యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సింగ’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. మలయాళ నటి అనార్కలి నాజర్ ఈ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్, గోపీచంద్ ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ ఎనౌన్స్‌మెంట్.. రా అగ్రెషన్, ఇంటెన్స్ ఎమోషన్స్ తో కూడిన వరల్డ్ ని ప్రజెంట్ చేసింది. తాజాగా చిత్ర బృందం కీలకమైన షూటింగ్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో సినిమా చిత్రీకరణ 50 శాతం పూర్తయింది. అద్భుతమైన ఫారెస్ట్ బ్యాక్…

Read more

సూర్య ‘సీన్’ సినిమా నవంబర్ 6న గ్రాండ్ రిలీజ్

హీరో సూర్య, మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జిత్తు మాధవన్‌తో కలసి యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘సీన్’ చేస్తున్నారు. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జ్యోతిక, సూర్య జాగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయశ్రీ దామోదరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మేకర్స్ టైటిల్ టీజర్‌ను విడుదల చేసి సినిమాలోని క్విర్కీ, ఎంటర్‌టైనింగ్ ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఫస్ట్ సింగిల్ ‘అమ్మో ఇది ఎవర్రా’ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ సింగిల్ ‘ఏరోప్లేన్’ అదిరిపోయే ఎనర్జీతో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎన్వీఆర్ సినిమా ద్వారా గ్రాండ్…

Read more

‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ టీమ్ బర్త్‌డే విషెస్.. భైరవగా సెట్స్‌లో అడుగుపెట్టిన ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ అద్భుతమైన విజయాన్ని సాధించడంతో, ఈ సినిమా సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫ్యూచర్, పురాణాల కలయికతో రూపొందిన ఈ ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్‌ను మరింత భారీ స్థాయికి తీసుకెళ్లేలా సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. విజనరీ ఫిల్మ్‌మేకర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇండియన్ సినిమా సూపర్‌హీరో, ప్రతి జనరేషన్‌కు డార్లింగ్ అయిన ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ ప్రత్యేకమైన బీటీఎస్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ వీడియో ద్వారా సినిమా సెట్స్‌లోని వాతావరణాన్ని, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భైరవ పాత్రలో ప్రభాస్ సెట్స్‌లోకి అడుగుపెట్టిన మూమెంట్స్ చూపించారు. షూటింగ్‌కు చిత్రబృందం సిద్ధమవుతున్న…

Read more

‘సలార్ 2’ కోసం ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రీయూనియన్

డైనోమైట్ ద్వయం.. వైలెంట్ మ్యాన్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి ‘సలార్: పార్ట్ 1 – సీజ్‌ఫైర్’తో ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లలో ఒకటిని అందించారు. ప్రముఖ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహా, శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ ఫ్రాంచైజీపై అంచనాలను మరింత పెంచుతూ ‘సలార్ 2’ సీక్వెల్‌ను ప్రకటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘డ్రాగన్’ సినిమా పనులు పూర్తయిన తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు. మరోవైపు ప్రభాస్ తన బిజీ…

Read more

‘ఒకే ఒక జీవితం’ డైరెక్టర్ శ్రీ కార్తిక్ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్‌

దక్షిణాది సినీ పరిశ్రమలో సెన్సేషన్‌గా మారిన రుక్మిణి వసంత్, దర్శకుడు శ్రీ కార్తిక్‌తో చేతులు కలిపారు. వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న ఈ కొత్త సినిమా ఇప్పటికే ట్రేడ్ వర్గాలతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని పెంచుతోంది. హై కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ కథాంశానికి తల్లీకొడుకుల మధ్య హత్తుకునే భావోద్వేగాలను జోడించి తెరకెక్కించిన ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’) విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత శ్రీ కార్తిక్ తెరకెక్కించనున్న నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘సప్త సాగరాలు దాటి’ చిత్రంలో తన అద్భుతమైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి వసంత్ ఈ సినిమాలో కథానాయికగా నటించనున్నారు. దేవ్ రామనాథ్, వినాయక్ వైద్యనాథన్…

Read more

‘రియాలిటీ’ చిత్రం నుంచి ‘భజ గోవిందం’ వీడియో సాంగ్ రిలీజ్

ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం తన ప్రతిష్టాత్మక చిత్రం ‘రియాలిటీ’తో నిత్యజీవితంలోని సహజమైన భావోద్వేగాలను, మన చుట్టూ ఉండే చిన్న చిన్న ఆనందాలను అందంగా ప్రజెంట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ‘క’, ‘కె-రాంప్’ చిత్రాల విజయాలతో జోరుమీదున్న ఆయన, ఈ సినిమాకు హీరోగా నటించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే అందించి దర్శకత్వం కూడా వహిస్తున్నారు. తన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి నిర్మిస్తుండగా, సురేష్ యెర్రా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మేకర్స్ తాజాగా ఈ సినిమా సంగీత ప్రయాణాన్ని ప్రారంభిస్తూ తొలి పాట ‘భజ గోవిందం’ ఫుల్ వీడియోను విడుదల చేశారు. గతంలో విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు మంచి స్పందన లభించగా, ఈ పాట…

Read more

‘రోమియో జూలియట్’ నవంబర్ 13న రిలీజ్

హర్షిత్, విశాఖ ధిమాన్ జంటగా నటిస్తున్న ‘రోమియో జూలియట్’ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. భార్గవ్ మాచర్ల రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ సమర్పిస్తుండగా, నవరస ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుందీప్ ఎన్, వెంకటేశ్వరరావు చల్లగుళ్ల నిర్మిస్తున్నారు. దసరా పర్వదినం సందర్భంగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ‘రోమియో జూలియట్’ నవంబర్ 13న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ రొమాన్స్, యాక్షన్ అంశాల కలయికతో ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో హర్షిత్ సన్‌గ్లాసెస్ ధరించి, చేతిలో గన్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. విశాఖ ధిమాన్ ఎరుపు రంగు దుస్తుల్లో అందంగా కనిపిస్తున్నారు. చుట్టూ ముళ్ల తీగలు, ఎర్ర గులాబీలు, గాలిలో ఎగురుతున్న పూలరేకులు కనిపిస్తున్నాయి. బుల్లెట్లు పోస్టర్‌కు…

Read more

‘దొంగ నా కొడుకు’ కడుపుబ్బా నవ్వించే క్రైమ్ కామెడీ: హీరో మౌళి

మౌళి తనూజ్ ప్రశాంత్, శ్రీను కంబాల, మైత్రీ మూవీ మేకర్స్ రాబరీ క్రైమ్ కామెడీ ‘దొంగ నా కొడుకు’ టీజర్ లాంచ్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్లను అందిస్తున్న పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, మరోవైపు మీడియం బడ్జెట్‌తో కంటెంట్‌కు ప్రాధాన్యమున్న సినిమాలను కూడా నిర్మిస్తోంది. ఈ సంస్థ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘దొంగ నా కొడుకు’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆసక్తిని పెంచిన ఈ సినిమా నవంబర్ 13న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ టీజర్‌ను విడుదల చేసి ప్రమోషనల్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈశ్వర్ బీటెక్ మధ్యలోనే చదువు…

Read more

ఆకట్టుకుంటున్న ‘బబ్లూ XXL’ టైటిల్ పోస్టర్

ప్రముఖ నిర్మాతలు పుష్కూర్ రామ్ మోహన్ రావు, భరత్ ఎన్. నారంగ్ నేతృత్వంలోని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థ తమ ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ నంబర్ 10తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. యంగ్ ట్యాలెంటెడ్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జెన్ జెడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా సాయిలు కంపాటి దర్శకుడిగా రెండో సినిమా. ఆయన తొలి చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’ బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి ‘బబ్లూ XXL’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ, మేకర్స్ కలర్ ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. దసరా పర్వదినం సందర్భంగా ప్రకటించిన ఈ టైటిల్,…

Read more

‘రామాయణం’ నుంచి యశ్ రావణ తాండవం రిలీజ్

నమిత్ మల్హోత్రా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘రామాయణ’ ప్రపంచవ్యాప్తంగా 2026 నవంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, అక్టోబర్ 20 నుంచి దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన సందర్భంగా, దసరా పండగను పురస్కరించుకుని మేకర్స్ రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా కనిపించే ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈ కొత్త వీడియోలో యశ్ లంకాధిపతి రావణుడిగా ఎలా మారారో చూపించారు. గంభీరమైన రూపం, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో యశ్ ఆకట్టుకున్నారు. హిందీలో ‘రైజ్ ఆఫ్ అసుర’ పేరుతో విడుదలైన ఈ వీడియోలో పవర్ ఫుల్ సంగీతంతో కూడిన రావణ తాండవాన్ని ఆవిష్కరించారు. హిందూ పురాణాల్లో తాండవం అనేది పరమశివుడితో ముడిపడిన విశ్వ నృత్యం. సృష్టి, స్థితి, లయ చక్రాలకు ఇది ప్రతీకగా…

Read more