ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ వస్తున్న మూవీ జ్యోతి పూర్వజ్,…
‘దొంగ నా కొడుకు’ కడుపుబ్బా నవ్వించే క్రైమ్ కామెడీ: హీరో మౌళి
మౌళి తనూజ్ ప్రశాంత్, శ్రీను కంబాల, మైత్రీ మూవీ మేకర్స్ రాబరీ క్రైమ్ కామెడీ ‘దొంగ నా కొడుకు’ టీజర్ లాంచ్
సెన్సేషనల్ బ్లాక్బస్టర్లను అందిస్తున్న పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, మరోవైపు మీడియం బడ్జెట్‌తో కంటెంట్‌కు ప్రాధాన్యమున్న సినిమాలను కూడా నిర్మిస్తోంది. ఈ సంస్థ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘దొంగ నా కొడుకు’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆసక్తిని పెంచిన ఈ సినిమా నవంబర్ 13న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ టీజర్‌ను విడుదల చేసి ప్రమోషనల్ కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈశ్వర్ బీటెక్ మధ్యలోనే చదువు ఆపేసిన యువకుడు. డబ్బుకే ప్రాధాన్యమిచ్చే తల్లిదండ్రులు, ఓ స్నేహితుడు, ప్రేయసి.. ఇలా అతడి జీవితంలో చాలామంది ఉంటారు. అయితే వచ్చే జన్మలో వీళ్లెవరూ తనకు వద్దని, కేవలం డబ్బు మాత్రమే కావాలని ఈశ్వర్ కోరుకుంటాడు. ఈ క్రమంలో కథలోకి రాబరీ, క్రైమ్ అంశాలు ప్రవేశించడంతో కథనం ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. చివర్లో బీచ్‌లో ఈశ్వర్, అతడి ప్రేయసి మధ్య జరిగే సరదా టిఫిన్ ఎపిసోడ్‌తో టీజర్ నవ్వులు పంచుతూ ముగుస్తుంది.
‘లిటిల్ హార్ట్స్’ సినిమాలో తన నటనతో ప్రశంసలు అందుకున్న మౌళి తనూజ్ ప్రశాంత్ మరోసారి తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. పౌడర్ సీక్వెన్స్ నుంచి జీవితం గురించి ఆయన చెప్పే సరదా మాటలు, చివర్లో వచ్చే టిఫిన్ ఎపిసోడ్ వరకు పలు సన్నివేశాల్లో తనదైన హాస్యాన్ని పండించారు. ఆయన ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, పాత్రలోని విభిన్న కోణాలు టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రేయసి పాత్రలో సుష్మిత శెట్టి సహజంగా కనిపించారు. అలీ, రజిత ఈశ్వర్ తల్లిదండ్రులుగా నటించగా, రఘుబాబు, ప్రియా, గుండు సుదర్శన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.
దర్శకుడు శ్రీను కంబాల కథానాయకుడి విభిన్నమైన వ్యక్తిత్వం, హాస్యభరిత సన్నివేశాల చుట్టూ కథను అల్లుకున్నారు. మౌళి పాత్రను తీర్చిదిద్దిన తీరు, కథలోని వివిధ సన్నివేశాల్లో కామెడీని జోడించిన విధానం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలనే దర్శకుడి ప్రయత్నాన్ని తెలియజేస్తున్నాయి.
నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలుగా, అనిల్ యెర్నేని సహ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథకు తగ్గట్టుగా మంచి ప్రొడక్షన్ వాల్యూస్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ అందించగా, సింజిత్ ఎర్రమిల్లి సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీధర్ సోంపల్లి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, నాగేంద్ర గువ్వల ప్రొడక్షన్ డిజైనర్.
‘దొంగ నా కొడుకు’ టీజర్ రాబరీ, క్రైమ్ అంశాలతో కూడిన ఆసక్తికరమైన కథకు హాస్యాన్ని జోడించి ప్రేక్షకులను అలరించబోతున్నామనే సంకేతాలిచ్చింది. మౌళి తనూజ్ ప్రశాంత్ కామెడీ టైమింగ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుండటంతో, నెల రోజుల్లోపే థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతోంది.
టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరో మౌళి మాట్లాడుతూ.. మా నిర్మాతలు రవి గారికి, నవీన్ గారికి థాంక్యూ. మాకు మొదటి నుంచి చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. వాళ్లతో కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మంచి కథతో అందరినీ కడుపుబ్బా నవ్వించే క్రైమ్ కామెడీ సినిమా. ఈ సినిమాను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. నాకు ఇంత మంచి కథ తీసుకొచ్చిన డైరెక్టర్‌కు థాంక్యూ. కథ నచ్చి అలీ గారు ఈ సినిమా చేస్తానని చెప్పడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. మా అందరికీ చాలా సపోర్ట్ చేశారు. అలాగే రజిత గారు కూడాచాలా సపోర్ట్ చేశారు. వాళ్లతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది.సింజిత్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే ఈ సినిమాకు పనిచేసిన టెక్నికల్ టీమ్ కూడా బెస్ట్ వర్క్ ఇచ్చారు. ఫుల్‌గా నవ్వుకోవాలని ఈ సినిమా చేశాం. నవంబర్ 13న మీరందరూ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి రండి. ఎంజాయ్ చేసి బయటికి వెళ్తారు. ఇది నా గ్యారెంటీ.
డైరెక్టర్ శ్రీను కంబాల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ టైటిల్ ఎవరికి చెప్పినా చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యేవారు. కానీ కొంతమంది మాత్రం నెగిటివ్‌గా చూస్తున్నారు. సినిమా చూసిన తర్వాత ఇది ఎందుకు పెట్టామో మీరే చెప్తారు. ఇది క్రైమ్ కామెడీ. ఫ్యామిలీ అందరూ వచ్చి ఎంజాయ్ చేసే సినిమా. మౌళి దగ్గర నుంచి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. నా మొదటి సినిమానే మైత్రీలో చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. దీనికి కారణం మౌళి. మౌళి నన్ను నమ్మినఈజీ అయింది. ఆయన నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. సినిమా బెస్ట్ ప్రొడక్ట్‌గా వచ్చింది. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ టైటిల్ ఇందులో మౌళి క్యారెక్టర్‌కు కరెక్ట్‌గా ఉంటుంది. సినిమా చాలా హిలేరియస్‌గా ఉంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అలీ గారు, రజిత గారు, గుండు సుదర్శన్ గారు, రఘుబాబు గారు.. ఇలా అందరూ అద్భుతంగా చేశారు. ‘లిటిల్ హార్ట్స్’ తర్వాత మౌళి సినిమా చూడటానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాకు పనిచేసిన అందరూ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అన్నీ బాగా కుదిరాయి. సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను నవంబర్ 11న తప్పకుండా అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూస్తారని కోరుకుంటున్నాను.
నటుడు అలీ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. దర్శకుడు కథ చెప్పిన విధానం చూస్తే కొత్త డైరెక్టర్లా అనిపించలేదు. మౌళి మంచి టైమింగ్ ఉన్న నటుడు. ‘దొంగ నా కొడుకు’ అనేది చాలా కాస్ట్ టైటిల్. అందరూ చాలా అద్భుతంగా చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌లో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాను చూసి ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.
మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ మాట్లాడుతూ.. నా కెరీర్లో వచ్చిన ఫస్ట్ చెక్ మైత్రీ మూవీ మేకర్స్ నుంచే అందుకున్నాను. ‘డియర్ కామ్రేడ్’లో చేసిన చిన్న క్యారెక్టర్‌కు ఆ చెక్ వచ్చింది. ఇప్పుడు వారి నిర్మాణంలో మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. మౌళితో నా స్పెషల్ కొలాబరేషన్ ఇది. సినిమా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.ఈ వేడుకలో టీం అందరూ పాల్గొన్నారు.
నటీనటులు: మౌళి తనూజ్ ప్రశాంత్, సుష్మిత శెట్టి, అలీ, రజిత, రఘుబాబు, ప్రియా, గుండు సుదర్శన్
సాంకేతిక బృందం
రచన, దర్శకత్వం: శ్రీను కంబాల
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవి శంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సహ నిర్మాత: అనిల్ యెర్నేని
సినిమాటోగ్రఫీ: సూర్య బాలాజీ
సంగీతం: సింజిత్ యెర్రమిల్లి
ఎడిటర్: శ్రీధర్ సోంపల్లి
కాస్ట్యూమ్ డిజైనర్: మహి దేరంగుల
ఆర్ట్ డైరెక్టర్: నాగేంద్ర గువ్వల
సీఈఓ: చెర్రీ
పీఆర్వో: వంశీ–శేఖర్

