Skip to content

‘రుద్రవనం పీఎస్‌’ ట్రైల‌ర్ విడుద‌ల‌

‘క్రైమ్‌ను ఫాలో అయితే జ‌రిగింది మాత్ర‌మే తెలుస్తుంది.. కానీ క్రిమిన‌ల్‌ని ఫాలో అయితే జ‌ర‌గబోయేది కూడా తెలుస్తుంది’ అంటున్నారు రుద్రవనం సిన్సియర్ పోలీస్ ఆఫీస‌ర్ శివ‌కుమార్‌. ఇంత‌కీ ఈ శివ కుమార్ ఎవ‌రు? ఇత‌ను ఎవ‌ర్ని ఫాలో కావాల‌నుకుంటున్నాడ‌నే విష‌యం తెలుసుకోవాలంటే మాత్రం అక్టోబ‌ర్ 30 నుంచి జీ5లో ప్రీమియ‌ర్ కాబోతోన్న ఒరిజిన‌ల్ ‘రుద్ర‌వ‌నం పీఎస్‌’ చూడాల్సిందే.

రుద్రవనం ఊరిలో ఓ తల లేని మృతదేహం దొరుకుతుంది. త‌ర్వాత ఓ వ్య‌క్తి క‌నిపించ‌కుండా పోతాడు. దీంతో ఈ కేసుని సీరియ‌స్‌గా తీసుకున్న పోలీసులు ఎలాగైనా చేధించాల‌నుకుంటారు. కేసుని డీల్ చేసే ఎస్ఐ శివ‌కుమార్ ఆ కేసు వెనుక ఉన్న నిజాలను తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఒక్కో ఆధారం బయటపడుతున్న కొద్దీ అవినీతి, స్థానిక రాజకీయాలు, ఎన్నో ఏళ్లుగా బయటకు రాని రహస్యాలు వెలుగులోకి వస్తాయి. చివరకు ఈ పోరాటం కేవలం ఓ కేసుకే పరిమితం కాదు.. అది వ్యక్తిగత పోరాటంగా మారుతుంది. పైకి కనిపించే దానికంటే ఎన్నో రహస్యాలను దాచుకున్న ఓ ఊరులో ఉన్న అస‌లు ర‌హస్య‌మేంటనేది తెలుసుకోవాలంటే అక్టోబ‌ర్ 30 నుంచి జీ5 ఒరిజినల్‌గా స్ట్రీమింగ్ కానున్న 7 ఎపిసోడ్ల తెలుగు మినీ సిరీస్ ‘రుద్రవనం పీఎస్’ చూడాల్సిందే. విజ‌య‌ద‌శ‌మి రోజున మేక‌ర్స్ ఈ ఒరిజిన‌ల్ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. ట్రైల‌ర్‌లో పోలీసుల‌కు స‌వాలు విసిరిన కేసు.. దాన్ని వారు ఎలా చేధించార‌నేలా ఉండే కంటెంట్ ఒరిజిన‌ల్‌పై ఆస‌క్తిని పెంచుతోంది.

శ్రీచ‌క్ర‌మూవీస్ బ్యాన‌ర్‌పై శ‌శిధ‌ర్ మున్నంగి ఈ సినిమాను తెర‌కెక్కించారు. తాజ్ స‌య్య‌ద్ రైట‌ర్‌గా వ‌ర్క్ చేసిన ఈ మినీ సిరీస్‌కు అష్క‌ర్ అలీ సినిమాటోగ్ర‌ఫీని అందించారు.

వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో మెప్పిస్తోన్న న‌రేష్ అగ‌స్త్య ఈ సిరీస్‌తో మ‌రోసారి సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఇంకా ఈ చిత్రంలో బెన‌ర్జీ, శివ ఆల‌పాటి, సుగాలి సులోని, ర‌మేష్ కోనంబొట్ల‌, నారాయ‌ణ స్వామి, శివాని రెడ్డి, చారు, ప్రీతి సుంద‌ర్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

నటీనటులు:

ఎస్‌ఐ శివకుమార్‌గా నరేశ్ అగస్త్య
సీఐ వేణుగోపాల్‌గా బెనర్జీ
ఏఎస్‌ఐ మాధవ్‌గా శివ అలపాటి
ఏఎస్‌ఐ నిర్మలగా సుగాలి సిలోని
హెడ్ కానిస్టేబుల్ సుందర్‌గా రమేశ్ కొణంబొట్ల
కానిస్టేబుల్ గంగాధర్‌గా నారాయణ స్వామి
శ్రావణిగా శ్రావణి రెడ్డి
అంజిగా చారు వాకన్
స్వర్ణగా ప్రీతి సుందర్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

దర్శకత్వం: శశిధర్ మున్నంగి, రచన: తాజ్ సయ్యద్, సినిమాటోగ్రఫీ: అష్కర్ అలీ, ఎడిటింగ్: మాధవ్, ప్రొడక్షన్ డిజైనర్: ఆశిష్ తేజపులాల, నిర్మాణ సంస్థ: శ్రీ చక్ర మూవీస్

“Rudravanam” Trailer ▶️https://youtu.be/eauy_w3N7dE

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.