‘దొంగ నా కొడుకు’ కడుపుబ్బా నవ్వించే క్రైమ్ కామెడీ: హీరో మౌళి
మౌళి తనూజ్ ప్రశాంత్, శ్రీను కంబాల, మైత్రీ మూవీ మేకర్స్ రాబరీ క్రైమ్ కామెడీ ‘దొంగ నా కొడుకు’ టీజర్ లాంచ్ సెన్సేషనల్ బ్లాక్బస్టర్లను అందిస్తున్న పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, మరోవైపు మీడియం బడ్జెట్‌తో కంటెంట్‌కు ప్రాధాన్యమున్న సినిమాలను కూడా నిర్మిస్తోంది. ఈ సంస్థ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘దొంగ నా కొడుకు’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆసక్తిని పెంచిన ఈ సినిమా నవంబర్ 13న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ టీజర్‌ను విడుదల చేసి ప్రమోషనల్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈశ్వర్ బీటెక్ మధ్యలోనే చదువు…
