Skip to content

‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ టీమ్ బర్త్‌డే విషెస్.. భైరవగా సెట్స్‌లో అడుగుపెట్టిన ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ అద్భుతమైన విజయాన్ని సాధించడంతో, ఈ సినిమా సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫ్యూచర్, పురాణాల కలయికతో రూపొందిన ఈ ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్‌ను మరింత భారీ స్థాయికి తీసుకెళ్లేలా సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. విజనరీ ఫిల్మ్‌మేకర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇండియన్ సినిమా సూపర్‌హీరో, ప్రతి జనరేషన్‌కు డార్లింగ్ అయిన ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ ప్రత్యేకమైన బీటీఎస్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ వీడియో ద్వారా సినిమా సెట్స్‌లోని వాతావరణాన్ని, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భైరవ పాత్రలో ప్రభాస్ సెట్స్‌లోకి అడుగుపెట్టిన మూమెంట్స్ చూపించారు.

షూటింగ్‌కు చిత్రబృందం సిద్ధమవుతున్న విజువల్స్ తో ఈ వీడియో ప్రారంభమవుతుంది. ప్రభాస్ తన ప్రత్యేకమైన భైరవ లుక్‌లో సెట్స్‌లోకి అడుగుపెట్టడానికి ముందు ప్రొడక్షన్ టీమ్ అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ‘యాక్షన్’ అని చెప్పగానే భైరవగా ప్రభాస్ కెమెరా ముందుకు వస్తారు. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మొదటి భాగంలో ప్రేక్షకుల ఆదరణ పొందిన భైరవ పాత్రను మరోసారి వెండితెరపై చూసేందుకు ఈ గ్లింప్స్ అంచనాలు పెంచుతోంది.

ఈ భారీ సీక్వెల్‌లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు, ప్రేక్షకులు, విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంది. రెండు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుని ‘కల్కి 2898 ఏడీ’ ఫ్రాంచైజీ ప్రత్యేకతను మరింత పెంచింది.

సీక్వెల్ కోసం భారీ స్థాయిలో ప్రీ-ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. రెగ్యులర్ షూటింగ్ దశలోకి అడుగుపెట్టేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.

నాగ్ అశ్విన్ ఈ సినిమాటిక్ యూనివర్స్ స్కేల్, స్థాయిని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతుండటంతో ‘కల్కి 2′ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. తాజాగా విడుదలైన బీటీఎస్ గ్లింప్స్‌తో ఈ ప్రాజెక్టుపై అంచనాలు మరింత పెరిగాయి.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.