Skip to content

‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ టీమ్ బర్త్‌డే విషెస్.. భైరవగా సెట్స్‌లో అడుగుపెట్టిన ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ అద్భుతమైన విజయాన్ని సాధించడంతో, ఈ సినిమా సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫ్యూచర్, పురాణాల కలయికతో రూపొందిన ఈ ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్‌ను మరింత భారీ స్థాయికి తీసుకెళ్లేలా సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. విజనరీ ఫిల్మ్‌మేకర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇండియన్ సినిమా సూపర్‌హీరో, ప్రతి జనరేషన్‌కు డార్లింగ్ అయిన ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ ప్రత్యేకమైన బీటీఎస్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ వీడియో ద్వారా సినిమా సెట్స్‌లోని వాతావరణాన్ని, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భైరవ పాత్రలో ప్రభాస్ సెట్స్‌లోకి అడుగుపెట్టిన మూమెంట్స్ చూపించారు. షూటింగ్‌కు చిత్రబృందం సిద్ధమవుతున్న…

Read more

సింగీతం శ్రీనివాసరావు గారు మరణం లేని మహనీయుడు: అశ్వినీదత్

దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారి మరణం పట్ల ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సింగీతం శ్రీనివాసరావు గారి మృతికి సంతాపం తెలియజేస్తూ భావోద్వేగంతో నివాళులు అర్పించారు. ''తెలుగు సినిమాకే వెలుగులు పంచిన విజయా సంస్థ దర్శక వారసుడు సింగీతం శ్రీనివాసరావు గారు వెళ్ళిపోయారు. గుండె కలచివేసింది. కళ్ళు చెమర్చాయి. కళాఖండాలను రూపొందించినా, నిరాడంబరుడిగానే చివరివరకూ మసలిన దార్శనిక ముని ఆయన. ఒకప్పుడు ఆయనతో చేద్దామనుకున్నా కథ కలిసి రాలేదు. కానీ నా కల ఆగిపోలేదు. 'సింగ్ గీతం' రూపంలో వైజయంతీ పతాకం మీద శాశ్వతంగా వెలుగుతూనే ఉంటుంది. మరణం లేని మహనీయుడు. ఆయనకి నా కన్నీటి వీడ్కోలు'' -అశ్వినీదత్ చలసాని

Read more