Skip to content

‘ది ఇండియా స్టోరీ’ ఇంటెన్స్ పోస్టర్ రిలీజ్

జీ స్టూడియోస్, ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ది ఇండియా స్టోరీ’ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సాగర్ బి. షిండే కథ అందించడంతో పాటు నిర్మిస్తున్నారు. సమాజానికి సంబంధించిన కీలక అంశాన్ని కోర్ట్‌రూమ్ డ్రామా రూపంలో చూపిస్తున్న ఈ సినిమా జూలై 24, 2026న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

విషపూరిత పురుగుమందుల వ్యవసాయం, దాని వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న తీవ్ర ప్రభావం వంటి అంశాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని కొత్త పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.

విడుదల చేసిన పోస్టర్‌లో కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో కనిపిస్తున్నారు. ఒక భయానక నిజాన్ని బయటపెట్టేందుకు వారు చేసే పోరాటాన్ని ఈ పోస్టర్ సూచిస్తోంది.

కూరగాయల మార్కెట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ పోస్టర్‌లో ఇద్దరూ ఆగ్రహంతో ఉన్న వ్యాపారుల మధ్య చిక్కుకున్నట్లు చూపించారు. చుట్టూ ఉన్న జనాలు వారిపై కూరగాయలు విసురుతూ, వేలెత్తి చూపిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాజల్, శ్రేయాస్ ముఖాల్లో కనిపించే భయం, చుట్టూ నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నిజాన్ని బయటపెట్టే ప్రయత్నం చేసే వారికి ఎదురయ్యే ప్రతిఘటనను బలంగా చూపిస్తోంది.

“స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్…” అనే ట్యాగ్‌లైన్ సినిమా ప్రధాన అంశాన్ని మరింత స్పష్టంగా చెబుతోంది. లక్షలాది మంది జీవితాలపై ప్రభావం చూపుతున్న ఒక ప్రమాదాన్ని ఈ సినిమా తెరపైకి తీసుకురాబోతున్నట్లు ఇది సూచిస్తోంది.

ఈ సందర్భంగా దర్శకుడు చేతన్ డీకే మాట్లాడుతూ, “ఈ పోస్టర్ నిజం చెప్పడానికి చెల్లించాల్సిన మూల్యాన్ని చూపిస్తుంది. మోసంతో నడిచే వ్యవస్థను ప్రశ్నిస్తే మొదట ఎదురయ్యేది భయం, ఆగ్రహమే. ‘ది ఇండియా స్టోరీ’లోని ప్రతి సన్నివేశం ఆ పోరాటాన్ని చూపించడంతో పాటు, మనం తినేది, నమ్మేది గురించి ప్రేక్షకులు ఆలోచించేలా చేస్తుంది”

ఈ చిత్రానికి స్వాతి వినాయక్ సైందానే, అనితా జాధవ్, వినాయక్ సైందానే, కల్పేష్ షా, దేవయాని ఖోరాటే, ప్రేమ్ జోషి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, నిశాంత్ భగవత్ సినిమాటోగ్రఫీ అందించగా, మంగేష్ ధాక్డే సంగీతం సమకూరుస్తున్నారు. ఆశిష్ మత్రే ఎడిటింగ్, షకీల్ అజ్మీ సాహిత్యం, అన్మోల్ భావే సౌండ్ డిజైనర్.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.