Skip to content

సాయి దుర్గ తేజ్ ‘SYG’ (సంబరాల ఏటి గట్టు) షూటింగ్ పూర్తి

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సంబరాల ఏటి గట్టు’ (ఎస్‌వైజీ) షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం, థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్న క్రమంలో కీలక మైలురాయిని చేరుకుంది. బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’ చిత్రాన్ని నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలో ఇప్పటివరకు తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఇది.

ఈ సుదీర్ఘమైన, కష్టతరమైన ప్రయాణం ముగిసిన సందర్భంగా మేకర్స్ ఓ బిహైండ్ ద సీన్స్ వీడియోను విడుదల చేశారు. సినిమా కోసం రూపొందించిన భారీ సెట్స్, రా అగ్రెషన్‌తో కూడిన యాక్షన్ సన్నివేశాలు, టీమ్ మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్‌ను ఈ వీడియోలో చూపించారు.

భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం 160 రోజులకు పైగా చిత్రీకరణ జరిపారు. 10కి పైగా భారీ షూటింగ్ షెడ్యూల్స్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న అంబిషన్, టీమ్ కమిట్‌మెంట్‌ను ఈ ఇంటెన్స్ షూటింగ్ తెలియజేస్తోంది. సాయి దుర్గ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా రూపొందుతున్న ‘ఎస్‌వైజీ’ ఆయన కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలవనుంది.

ఈ సందర్భంగా సాయి దుర్గ తేజ్ తన టీమ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సెట్స్‌లో సందడి వాతావరణం నెలకొంది. టీమ్ సభ్యులంతా కేరింతలు కొడుతూ, ఒకరినొకరు హాగ్ చేసుకుంటూ, సరదాగా నీళ్లు, ఫేక్ బ్లడ్ చల్లుకుంటూ షూటింగ్ పూర్తయిన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.

‘సంబరాల సంక్రాంతి’ అంటూ మేకర్స్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఎస్‌వైజీ ప్రేక్షకులకు ఓ గ్రాండ్ సినిమాటిక్ సెలబ్రేషన్ అందించేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ చిత్రంలో బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నటుడు కీలక పాత్రలో నటిస్తుండగా, కన్నడ నటుడు ధనంజయ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి, జగపతిబాబు, నరేష్ వి. కృష్ణ, సాయికుమార్, శ్రీకాంత్ మేక, అనన్య నాగళ్ల తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. వెట్రివేల్ పలనిసామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. నవీన్ విజయ్ కృష్ణ ఎడిటింగ్, గాంధీ నడికుడికర్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షిస్తున్నారు.

షూటింగ్ పూర్తవడంతో, థియేట్రికల్ రిలీజ్‌కు ముందు చేపట్టాల్సిన తదుపరి పనులపై చిత్ర బృందం దృష్టి పెట్టింది.

2027 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు ‘సంబరాల ఏటి గట్టు’ సిద్ధమవుతోంది. సంక్రాంతి పండుగకు మరింత సందడిని తీసుకొచ్చేలా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. భారీ అంచనాలతో ఈ చిత్రం సంక్రాంతి సీజన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

నటీనటులు: సాయి దుర్గ తేజ్, ఐశ్వర్య లక్ష్మి, ధనంజయ, జగపతిబాబు, నరేష్, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల, రవి కృష్ణ

సాంకేతిక బృందం:

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: రోహిత్ కేపీ
నిర్మాతలు: కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
సినిమాటోగ్రఫీ: వెట్రి పలనిసామి
సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్
ఎడిటర్: నవీన్ వి. కృష్ణ
ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్
కాస్ట్యూమ్ డిజైనర్: ఆయేషా మరియం
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హ్యాష్‌ట్యాగ్ మీడియా

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.