మాస్ కా దాస్ విశ్వక్సేన్, తారక్ సినిమాస్, గ్లోబల్ స్లాషర్ ఫిల్మ్ ‘#CULT’ డెడ్లీ సర్వైవల్…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా సినిమా ‘స్పిరిట్’ 2027 అక్టోబర్ 29న వరల్డ్ వైడ్ రిలీజ్
రెబల్ స్టార్ ప్రభాస్, బ్లాక్‌బస్టర్ ఫిల్మ్‌మేకర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంది. భారీ అంచనాలున్న ఈ యాక్షన్ డ్రామా 2027 అక్టోబర్ 29న దీపావళి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో వచ్చే ఏడాది బిగ్గెస్ట్ రిలీజ్‌లలో ఒకటిగా ఈ సినిమా నిలవనుంది.
మేకర్స్ తాజాగా విడుదల చేసిన కొత్త రిలీజ్ పోస్టర్ ద్వారా విడుదల తేదీని ప్రకటించారు. ఈ పోస్టర్లో ప్రభాస్ ఇంటెన్స్, స్టైలిష్, మిస్టీరియస్ అవతార్‌లో కనిపిస్తున్నారు. బ్లాక్ క్యాప్, డార్క్ సన్‌గ్లాసెస్, గడ్డంతో క్లోజప్ ప్రొఫైల్ షాట్లో ఆయన లుక్ ఆకట్టుకుంటోంది. డ్రామాటిక్ లైటింగ్‌తో ప్రభాస్ రఫ్ లుక్‌ను మరింత హైలైట్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ విజువల్‌కు, బోల్డ్ రెడ్ కలర్లో ఉన్న సినిమా టైటిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భారీ స్థాయి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే రెండు పవర్ హౌస్ లు ‘స్పిరిట్’తో ఒక్కటవుతున్నారు. తన మొదటి మూడు సినిమాలతోనే బాక్సాఫీస్ వద్ద బలమైన ట్రాక్ రికార్డ్‌ను సొంతం చేసుకున్న సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్‌ను మరో ఇంటెన్స్, పవర్ ఫుల్ కథలో ఆవిష్కరించబోతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కోసం దర్శకుడు ఎలాంటి పాత్రను, ఎలాంటి ప్రపంచాన్ని సృష్టించారో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి కథానాయికగా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. భద్రకాళి పిక్చర్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రభాస్ స్టార్డమ్, సందీప్ రెడ్డి వంగా ప్రత్యేకమైన స్టొరీ టెల్లింగ్, దీపావళి పండుగ విడుదల.. ఈ మూడు అంశాలతో ‘స్పిరిట్’ భారీ థియేట్రికల్ అట్రాక్షన్‌గా రూపుదిద్దుకుంటోంది.
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘స్పిరిట్’ ను 2027 అక్టోబర్ 29న దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం.

