Skip to content

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా సినిమా ‘స్పిరిట్’ 2027 అక్టోబర్ 29న వరల్డ్ వైడ్ రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్, బ్లాక్‌బస్టర్ ఫిల్మ్‌మేకర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంది. భారీ అంచనాలున్న ఈ యాక్షన్ డ్రామా 2027 అక్టోబర్ 29న దీపావళి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో వచ్చే ఏడాది బిగ్గెస్ట్ రిలీజ్‌లలో ఒకటిగా ఈ సినిమా నిలవనుంది. మేకర్స్ తాజాగా విడుదల చేసిన కొత్త రిలీజ్ పోస్టర్ ద్వారా విడుదల తేదీని ప్రకటించారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్ ఇంటెన్స్, స్టైలిష్, మిస్టీరియస్ అవతార్‌లో కనిపిస్తున్నారు. బ్లాక్ క్యాప్, డార్క్ సన్‌గ్లాసెస్, గడ్డంతో క్లోజప్ ప్రొఫైల్ షాట్‌లో ఆయన లుక్ ఆకట్టుకుంటోంది. డ్రామాటిక్ లైటింగ్‌తో ప్రభాస్ రఫ్ లుక్‌ను మరింత హైలైట్ చేశారు…

Read more