మాస్ కా దాస్ విశ్వక్సేన్, తారక్ సినిమాస్, గ్లోబల్ స్లాషర్ ఫిల్మ్ ‘#CULT’ డెడ్లీ సర్వైవల్…
“క్రేజీ కల్యాణం” రివార్డులు , అవార్డ్ లు కూడా సాధిస్తుంది – డా. నరేష్ విజయ కృష్ణ
‘నవరసరాయ’ డా. నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “క్రేజీ కల్యాణం”. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందించారు. ఇటీవలే “క్రేజీ కల్యాణం” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నటి నీల ప్రియ మాట్లాడుతూ – క్రేజీ కల్యాణం లాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. కేరళ అమ్మాయి అయినా అనుపమ తెలుగింటి అమ్మాయిలా డైలాగ్స్ చెప్పి ఆకట్టుకుంది. ప్రేక్షకుల ఆదరణ వల్లే మా సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడింది. అన్నారు.
నటుడు గౌరిశంకర్ మాట్లాడుతూ – మా క్రేజీ కల్యాణం సినిమా థియేటర్ లో ప్రేక్షకులతో కలిసి చూశాను. థియేటర్ నిండిపోయింది. ప్రేక్షకులు తెరపై కామెడీ సీన్స్ వస్తే నవ్వుతున్నారు. ఎమోషనల్ సీన్స్ లో థియేటర్ సైలెన్స్ అవుతోంది. చాలా మంది అమ్మాయిలు తమ పేరెంట్స్ తో కలిసి మా సినిమా చూసేందుకు రావడం సంతోషంగా ఉంది. అన్నారు.
నటుడు లక్ష్మి కిరణ్ మాట్లాడుతూ – డైరెక్టర్ బద్రప్ప నాకు తమ్ముడు లాంటి వాడు. కానీ ఈ సినిమాలో అవకాశం ఇవ్వడం ద్వారా నాకు దేవుడు అయ్యాడు. మా ప్రాంతాలైన మెదక్, సిద్ధిపేట, గజ్వేల్ లో ఎక్కడ థియేటర్ కు వెళ్లి మా సినిమా చూసినా ప్రేక్షకులు హౌస్ ఫుల్స్ అవుతున్నారు. నన్ను నటుడిగా గుర్తుపడుతున్నారు. అన్నారు
రైటర్ శ్రీనివాస రవీంద్ర మాట్లాడుతూ – ఇది ప్రతి తండ్రి, కూతురు చూడాల్సిన సినిమా. ప్రేమ, బాధ్యత కారణంగా తండ్రి తన కూతురుకు కొన్ని నిర్బంధాలు పెడతాడు. ఆ నిర్బంధాలు దాటుకుని వచ్చిన ఒక కూతురు కథే ఈ సినిమా. ఒక రకంగా అభ్యుదయ మూవీ అనుకోవచ్చు. మా సినిమాలో అనుపమ తన పర్ ఫార్మెన్స్ తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. అన్నారు.
డీవోపీ శ్యామ్ దూపాటి మాట్లాడుతూ – మేము థియేటర్స్ లో ఆడియెన్స్ తో కలిసి మా సినిమా చూశాం. వాళ్లు ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా అని చెబుతున్నారు. పాజిటివ్ టాక్ ఉండటం వల్లే రోజు రోజుకూ బాక్సాఫీస్ వద్ద మా మూవీ స్ట్రాంగ్ అవుతోంది. అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ సాయి కదిర మాట్లాడుతూ – మా సినిమాను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ ప్రతి చోటా పాజిటివ్ గా చెబుతూ పోస్ట్ లు చేస్తున్నారు. మా మూవీకి సపోర్ట్ గా నిలిచిన వారికి థ్యాంక్స్. అన్నారు.
లిరిసిస్ట్ డా.గోరటి వెంకన్న మాట్లాడుతూ – ఈ చిత్రంలో మూడు పాటలు రాశాను. పాటలు రాయడానికి కావాల్సినంత స్వేచ్ఛను దర్శకుడు ఇచ్చారు. తొలి సినిమా అంటే నిర్మాతలు అన్ని కమర్షియల్ హంగులు ఉండాలనుకుంటారు. కానీ ఎలాంటి అశ్లీలత, హింస, అసభ్యత లేకుండా చక్కటి ఫ్యామిలీ మూవీ నిర్మించడం నిర్మాతగా జగన్ మోహన్ రెడ్డి ప్యాషన్ ను చూపిస్తోంది. ఈ అవకాశాన్ని అంతే జాగ్రత్తగా ఉపయోగించారు దర్శకుడు బద్రప్ప. నరేష్, అనుపమ, తరుణ్ భాస్కర్, అఖిల్..ఇలా వీళ్లందరి నటన ఆకట్టుకుంది. ఒక పర్పస్ ఫుల్ మూవీగా మీ ముందుకు వచ్చిన క్రేజీ కల్యాణం సినిమాను ప్రేక్షకులే మరింత ముందుకు తీసుకెళ్లాలి. అన్నారు.
డైరెక్టర్ బద్రప్ప గాజుల మాట్లాడుతూ – మా క్రేజీ కల్యాణం సినిమాను ప్రతి ఆడ పిల్ల ఓన్ చేసుకుంటోంది. అమ్మాయిలు తమ కుటుంబంతో కలిసి మా సినిమాను చూస్తున్నారు. ఈ రోజు బతుకమ్మ పండుగ, ఇక రేపటి నుంచి మీ క్రేజీ కల్యాణం థియేటర్స్ లోనే సందడి చేస్తామంటూ అమ్మాయిలు చెబుతున్నారు. నేను నా జీవితంలో చూసిన మనుషులను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించాను. మా సినిమా ఇంత గ్రాండ్ గా మీ ముందుకు వచ్చి సక్సెస్ అందుకుందంటే అందుకు మా ప్రొడ్యూసర్ జగన్ మోహన్ గారే కారణం. ఆయన ధైర్యం వల్లే ఇదంతా సాధ్యమైంది. ఫ్యామిలీ ఆడియెన్స్ మా సినిమాను బాగా ఆదరిస్తున్నారు. వాళ్లు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వాళ్ల రెస్పాన్స్ తెలియజేస్తున్నారు. నిజాయితీగా ఒక మంచి కథ రాసి తీస్తే తప్పకుండా విజయం లభిస్తుందని మా క్రేజీ కల్యాణం సినిమాతో మరోసారి ప్రూవ్ అయ్యింది. అన్నారు.
ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ – ప్రీ రిలీజ్ తర్వాత మా టీమ్ అందరికీ షో వేశాం. సినిమా బాగుందని చెప్పారు. అలాగే బయట నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో అని టెన్షన్ పడ్డాం. మా సినిమాకు సపోర్ట్ చేసి విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ముందుగా మీడియా మిత్రుల్లో చాలా మంది నాకు మెసేజ్ లు, ఫోన్స్ చేసి మంచి సినిమా చేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. మేము చాలా జిల్లాలు తిరిగి థియేటర్స్ కు వెళ్తున్నాము. అనుపమ కూడా మాతో పాటు థియేటర్ విజిట్స్ కు వస్తోంది. నరేష్ గారు తన వెహికిల్స్ లోనే ఒక ప్రొడ్యూసర్ లా మమ్మల్ని తీసుకెళ్తున్నారు. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. పెద్ద సినిమాల మధ్య మీ సినిమా వేశారు కదా అంటున్నారు. కానీ పండక్కి అన్ని సినిమాలను ఆదరిస్తారని నమ్మాం. ఈ రోజు నుంచి మా సినిమా థియేటర్స్ లో మరింత పికప్ కాబోతోంది. మంచి చిత్రాన్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. మరోసారి మా టీమ్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ – మేము థియేటర్స్ విజిట్స్ కు వెళ్లినప్పుడు ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీలవుతున్నాం. ఇలాంటి మంచి సినిమా రావాలంటే బద్రప్ప లాంటి దర్శకుడు, జగన్ గారి లాంటి ప్రొడ్యూసర్, డా.గోరటి వెంకన్న లాంటి లిరిసిస్ట్, సురేష్ బొబ్బిలి లాంటి మ్యూజిక్ డైరెక్టర్..ఇలా టీమ్ అంతా ఉండాలి. ఇలాంటి సబ్జెక్ట్ ను నమ్మి సినిమా చేయాలంటే గట్స్, ప్యాషన్ ఉన్న ఇలాంటి టీమ్ కావాలి. పరదా సినిమా చేసినప్పుడు ఆ మూవీ కంటెంట్ మీద నమ్మకం ఉంది అని చెప్పాను. ఈ రోజు హాట్ స్టార్ లో ఆ సినిమా నెం.1 ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. మంచి సినిమా చేస్తే ప్రేక్షకులు తప్పకుండా ప్రశంసిస్తారు అనేందుకు ఆ సినిమా ఎగ్జాంపుల్. నేను నా కెరీర్ లో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాలను ప్రయత్నిస్తున్నాను. దాంతో ప్రేక్షకులకు వినోదంతో పాటు ఒక చిన్న మెసేజ్ కూడా ఇవ్వగలుగుతున్నా. కొత్తగా మీకు ఏదో చెప్పాలని అనుకుంటాను. నా కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్. ముఖ్యంగా నరేష్ గారి లాంటి ఆర్టిస్ట్ తో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి స్టోరీస్ ను సపోర్ట్ చేయడాన్ని ఇష్టపడతాను. ఫ్యామిలీస్ మా సినిమాను యాక్సెప్ట్ చేస్తున్నారు. అందుకే షోస్ పెరుగుతున్నాయి. హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. అన్నారు.
‘నవరసరాయ’ డా. నరేష్ విజయ కృష్ణ మాట్లాడుతూ – మా సినిమాను మీడియా మిత్రులు చాలా సపోర్ట్ చేస్తున్నారు. రివ్యూస్ లో మంచి రేటింగ్స్ ఇచ్చారు. డిఫ్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు మా సినిమాను ప్రశంసించి మా టీమ్ అందరినీ అభినందించారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం. మేము థియేటర్స్ విజిట్స్ కు వెళ్తూ మీడియా మిత్రుల స్పందన చూస్తున్నాం. దసరా పండక్కి రక్తపాతాల కథల సినిమాలతో పాటు రక్త సంబంధాల కథల సినిమాలు కూడా చూస్తామని తెలుగు ఆడియెన్స్ ప్రూవ్ చేశారు. మా డిస్ట్రిబ్యూటర్స్ నమ్మకం, ధైర్యం కూడా నిజమైంది. ఎమోషన్స్ లో ప్రతి తెలుగు వాడిని కలిపే సినిమా ఇది. అదే ఈ సినిమా సక్సెస్ కు కారణం. ఈ సినిమా రివార్డ్స్ తో పాటు అవార్డ్స్ కూడా సాధిస్తుంది. కథను నమ్మి మా ప్రొడ్యూసర్ బాగా ఖర్చు పెట్టి ఈ సినిమా నిర్మించారు. ఆయన ఈ రోజు దాదాపు బ్రేక్ ఈవెన్ లో ఉన్నారు. జగన్ మోహన్ లాంటి ప్రొడ్యూసర్స్ బాగుంటే ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని చేస్తారు. ఆయన ప్రాఫిట్స్ లోకి వెళ్తారు. ఇంత పెద్ద విజయాన్ని మా సినిమాకు ఇచ్చినందుకు ప్రేక్షకులకు, మీడియా మిత్రులకు థ్యాంక్స్. అన్నారు.
నటీనటులు – ‘నవరసరాయ’ డా. నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి, తదితరులు
టెక్నికల్ టీమ్
——————————-
కాస్ట్యూమ్ డిజైనర్ – జె.గాయత్రి దేవి
ఆర్ట్ డైరెక్టర్ – సాయి కదిర
ప్రొడక్షన్ డిజైనర్ – శ్రీపాల్ మాచర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అఖిల్ సాయి శ్రీమూర్తి
కొరియోగ్రాఫర్ – ఈశ్వర్ పెంటి
యాక్షన్ – డ్రాగన్ ప్రకాష్
లిరిక్స్ – గోరటి వెంకన్న, చైతన్య ప్రసాద్, కాసర్ల శ్యామ్
ఎడిటర్ – శ్రావణ్ కటికనేని
డీవోపీ – శ్యామ్ దూపాటి
మ్యూజిక్ – సురేష్ బొబ్బిలి
స్క్రీన్ ప్లే – శ్రీనివాస రవీంద్ర (ఎంఎస్ఆర్)
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా)
ప్రొడ్యూసర్ – బూసం జగన్ మెహన్ రెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే , డైలాగ్స్, డైరెక్షన్ – బద్రప్ప గాజుల

