Skip to content

“శనార్తి ” రెగ్యులర్ షూట్ ప్రారంభం

ఆదిత్య మూవీస్ సమర్పణ లో సంపత్ నంది టీమ్ వర్క్స్, శ్రీ ధనలక్ష్మి ప్రోడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో రాజ్ వెడ్స్ రాంబాయ్ ఫేమ్ అఖిల్ రాజ్, ఫోక్ క్వీన్ నాగదుర్గ హీరో, హీరోయిన్ లుగా రాబోతున్న చిత్రం “శనార్తి ” రెగ్యులర్ షూట్ కరీంనగర్ జిల్లా వెలిచాల లో పూజ కార్యక్రమం తో ఘనంగా మొదలయింది.

ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు సంపత్ నంది, ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి, ఇతర నటీనటులు పాల్గొన్నారు. సుమారు నెల పాటు వెలిచాల, గట్టు భూత్కూర్ లో జరగనుంది. ఈ చిత్ర దర్శకులు గణేష్ రాజ్ ఉప్పునూటి గంగాధర మండలం, గట్టు బూత్కూర్ చెందిన వారు కావడం విశేషం.

తెలంగాణ సంప్రదాయ, సాంస్కృతిక మూలాల్ని గుర్తు చేసే ఈ చిత్రం ఒక మరిచిపోలేని మైలురాయి గా నిలవనుంది.

రచయితగా, కథకుడిగా, షోరన్నర్‌గా తనకున్న ప్రతిభతో పేరుగాంచిన దర్శకుడు సంపత్ నంది ‘ఓదెల’ ఫ్రాంచైజీతో సహా విజయవంతమైన కథలు, ఫ్రాంచైజీలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ‘శనార్తి’తో ఆయన అనుబంధం ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచుతోంది.

తన విలక్షణమైన సంగీతంతో శంసలు పొందిన సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతపరంగా మరింత బలాన్ని చేకూరుస్తున్నారు. ఈ చిత్రానికి విశ్వనాథ్ రెడ్డి డీవోపీ, బేబీ సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్.

నటీనటులు: అఖిల్ రాజ్, నాగ దుర్గ, మురళీధర్ గౌడ్, సునందిని, సుంకర లక్ష్మి, రమేష్ నకిరికంటి, వైవా రెడ్డి, మై విలేజ్ షో రాజు, అంజి బాబు

సాంకేతిక బృందం :
నిర్మాత: కె. వి. శ్రీధర్ రెడ్డి, సంపత్ నంది
దర్శకత్వం: గణేష్ రాజ్ ఉప్పునూటి
రచయిత: యెన్నెన్జీ
డి.ఓ.పి : విశ్వనాథ్ రెడ్డి
ఆర్ట్ డైరెక్టర్: బేబీ సురేష్ భీమగాని
సంగీతం: సురేష్ బొబ్బిలి
కాస్ట్యూమ్ డిజైనర్: ఆయేషా మరియం
పబ్లిసిటీ డిజైన్స్: ధని ఏలే
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి
ప్రొడక్షన్ కంట్రోలర్: రమణ కొర్రపాటి
కో-డైరెక్టర్ : రవి కందుకూరి
పి.ఆర్.ఓ (PRO): వంశీ – శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.