“శనార్తి ” రెగ్యులర్ షూట్ ప్రారంభం
ఆదిత్య మూవీస్ సమర్పణ లో సంపత్ నంది టీమ్ వర్క్స్, శ్రీ ధనలక్ష్మి ప్రోడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో రాజ్ వెడ్స్ రాంబాయ్ ఫేమ్ అఖిల్ రాజ్, ఫోక్ క్వీన్ నాగదుర్గ హీరో, హీరోయిన్ లుగా రాబోతున్న చిత్రం "శనార్తి " రెగ్యులర్ షూట్ కరీంనగర్ జిల్లా వెలిచాల లో పూజ కార్యక్రమం తో ఘనంగా మొదలయింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు సంపత్ నంది, ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి, ఇతర నటీనటులు పాల్గొన్నారు. సుమారు నెల పాటు వెలిచాల, గట్టు భూత్కూర్ లో జరగనుంది. ఈ చిత్ర దర్శకులు గణేష్ రాజ్ ఉప్పునూటి గంగాధర మండలం, గట్టు బూత్కూర్ చెందిన వారు కావడం విశేషం. తెలంగాణ సంప్రదాయ, సాంస్కృతిక మూలాల్ని గుర్తు చేసే…
