‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ నుంచి ‘ఏదో బాగుందే..’ పాట విడుదల
రాజు వెడ్స్ రాంబాయ్ చిత్రంతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ రాజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'ఏ నిమిషానికి ఏమి జరుగునో'. ఒక విభిన్నమైన సస్పెన్స్ థ్రిల్లర్ రూపొందిస్తున్న ఈ సినిమాలో రతిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సాయితేజ దర్శకుడు. లక్కీ మీడియా, కేడీ అండ్ కో బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్, దీవెల శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణనంతర పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం నుంచి కృష్ణకాంత్ రచించిన ఏదో బాగుందే అనే లిరికల్ వీడియోను ప్రముఖ యువ కథానాయకుడు శ్రీవిష్ణు విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ '' సాంగ్ చాలా…
