Skip to content

‘ఆస్మాన్’ గొప్ప హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను – మంచు మనోజ్

శ్రీమతి. కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్ మీద మేఘాంశ్ శ్రీహరి హీరోగా రామ్ నందన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆస్మాన్’. ఈ సినిమాని వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. శ్రీహరి జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. మేఘాంశ్ శ్రీహరి పుట్టిన రోజు సందర్భంగా బుధవారం నాడు టీజర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కి రా కింగ్ మంచు మనోజ్, శివాత్మిక రాజశేఖర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..
రా కింగ్ మంచు మనోజ్ మాట్లాడుతూ .. ‘నా తమ్ముడు మేఘాంశ్ ‘ఆస్మాన్’ కోసం రావడం ఆనందంగా ఉంది. శ్రీహరి అంకుల్ మమ్మల్ని ఎత్తుకుని పెంచారు. నేను మేఘాంశ్‌ని ఎత్తుకున్నాను (నవ్వుతూ). సినిమా ఉన్నంత కాలం రియల్ స్టార్ శ్రీహరి గారు ఉంటారు. మేఘాంశ్‌ని నేను ఎలా చూడాలని అనుకున్నానో టీజర్‌లో అలా కనిపించాడు. టీజర్ నాకు చాలా నచ్చింది. ప్రశాంత్ గారి బీజీఎం అదిరిపోయింది. అరబిక్‌లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ‘ఆస్మాన్’ గొప్ప హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా తమ్ముడు మేఘాంశ్‌ను అందరూ ఆదరించి మంచి విజయాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ .. ‘‘ఆస్మాన్’ కోసం వచ్చిన మనోజ్ అన్నకి, శివాత్మికకు థాంక్స్. ‘ఆస్మాన్’ మూవీని ఎంజాయ్ చేస్తూ చేశాను. షోయబ్ గారితో ఆల్రెడీ ఓ మూవీ చూస్తున్నాను. షోయబ్ గారి వల్లే ఈ చిత్రం ఈ స్థాయిలో వచ్చింది. రాయంచ అద్భుతంగా నటించారు. రామ్ నందన్ ఈ సినిమాని గొప్ప స్థాయిలో తెరకెక్కించారు. ఈ చిత్రం కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అది నా ప్రామీస్’ అని అన్నారు.

శివాత్మిక మాట్లాడుతూ .. ‘‘ఆస్మాన్’ టీజర్ అద్భుతంగా ఉంది. విజువల్స్, మేఘాంశ్ డైలాగ్స్ బాగున్నాయి. రాయంచ ముద్దుగా కనిపిస్తున్నారు. ప్రశాంత్ గారి మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. మేఘాంశ్ నా స్కూల్లో సీనియర్. ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌కి మంచి విజయం దక్కాలి. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకుడు రామ్ నందన్ మాట్లాడుతూ .. ‘‘ఆస్మాన్’ టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. చాలా వరకు రివీల్ చేశామనే చెప్పొచ్చు. మోషన్ పోస్టర్ నుంచి మొదలైన సస్పెన్స్‌ను టీజర్‌తో పెంచాం. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత వెంకటేష్, శ్రీకాంత్ గారికి థాంక్స్. మా హీరో మేఘాంశ్‌కి టాలెంట్‌తో పాటు డెడికేషన్ ఉంది. షోయబ్ గారు మంచి విజువల్స్ ఇచ్చారు. ప్రశాంత్ గారి మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంటుంది. రాయంచ అద్భుతంగా నటించారు. సినిమా రిలీజ్ వరకు ఏదో ఒక మిస్టరీ ఇస్తూనే ఉంటాం’ అని అన్నారు.

నిర్మాత వెంకటేష్ కొండారు మాట్లాడుతూ .. ‘ మేం చెప్పాలన్నకున్నదంతా ‘ఆస్మాన్’ టీజర్ రూపంలో చెప్పేశాం. శ్రీహరి గారి ఫ్యామిలీతో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన శాంతమ్మ, శశాంక్, మేఘాంశ్ గారికి థాంక్స్. మా కోసం వచ్చిన మనోజ్ అన్నకి, శివాత్మిక గారికి థాంక్స్’ అని అన్నారు.

హీరోయిన్ రాయంచ మాట్లాడుతూ .. ‘‘ఆస్మాన్’ టీజర్ లాంచ్‌కి వచ్చిన మనోజ్ గారికి, శివాత్మిక గారికి థాంక్స్. నాకు ఇంత మంచి చిత్రంలో ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. షోయబ్ గారు మా అందరినీ అద్భుతంగా చూపించారు. ఈ చిత్రంతో మేఘాంశ్‌కి మంచి విజయం దక్కాలి. మా సినిమాకి మీడియా, ఆడియెన్స్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ప్రశాంత్ ఆర్ విహారి మాట్లాడుతూ .. ‘‘ఆస్మాన్’లో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ‘ఆస్మాన్’కి పని చేయడాన్ని ఎంతో ఎంజాయ్ చేశాను. మా కోసం ఈరోజు వచ్చిన మనోజ్ గారికి, శివాత్మిక గారికి థాంక్స్. మేఘాంశ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని అన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.