Skip to content

‘సిగ్మా’ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ : హీరో సందీప్ కిషన్

‘సిగ్మా’ మంచి ఫన్ రైడ్‌లా ఉంటుంది. నాన్నగారు సినిమా కోసం ఎదురుచూస్తున్నారు: డైరెక్టర్ జేసన్ సంజయ్

సందీప్ కిషన్ క్రేజీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ‘సిగ్మా. దర్శకుడిగా జేసన్ సంజయ్ డెబ్యూ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది. టీజర్, సాంగ్స్ మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని కోస్తాంధ్ర, తెలంగాణలో విడుదల చేయనుండగా, ఎన్‌వీఆర్ సినిమా సీడెడ్‌లో రిలీజ్ చేస్తోంది. సిగ్మా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్‌లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాతో సంజయ్‌ని తెలుగు సినిమాలకి పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది. తను చాలా మంచి కుర్రాడు. తన విషయంలో నాకు చాలా గర్వంగా ఉంటుంది. నా ప్రాధాన్యత ఎప్పుడూ తెలుగులోనే ఉంటుంది. కాకపోతే ఒక తెలుగు హీరో తమిళ్‌లో కూడా ఇలాంటి సినిమా చేయగలిగాడు అనేది హ్యాపినెస్ ఇస్తోంది. డైరెక్టర్ సంజయ్ కూడా సినీ పరిశ్రమలో చాలా ఎత్తుకు ఎదుగుతాడు. తన తొలి సినిమా నాది కావడం నాకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. తెలుగు ఆడియన్స్ నాకు ఇచ్చిన ప్రేమ, గుర్తింపు చాలా ఎక్కువ. తెలుగు నటుడిగా బ్రతికిన జీవితమే ఎక్కువ. ఒక తెలుగు హీరోగా నేను చాలా గర్వపడతాను. అలాగే తమిళ ప్రేక్షకులు నాకు ఇచ్చిన ప్రేమ, ఆదరణ చూసి ఒక్కొక్కసారి నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సంజయ్ తెలుగు సినిమాకి చాలా పెద్ద అభిమాని. దాదాపుగా తను తెలుగు సినిమాలన్నీ చూస్తాడు. సంజయ్ అనుకుంటే ఎవరైనా తనకి హీరోలుగా దొరుకుతారు. కాకపోతే రెండు భాషలకిసరిపోయే హీరో కావాలని, తను అనుకున్న క్యారెక్టర్‌కి బెస్ట్ ఇవ్వాలని నన్ను తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. తను 70 రోజుల్లో సినిమా తీస్తానని ప్రొడ్యూసర్లకి చెప్పాడు. 63 రోజుల్లోనే తను అనుకున్నది పూర్తి చేశాడు. నాకు 100% బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చి, తను ఏ కథ చెప్పాడో అదే తీశాడు. తను సినిమాని చాలా జెన్యూన్‌గా ప్రేమిస్తున్నాడు. చాలా జెన్యూన్ ఇంటెన్షన్ ఉంది. సినిమా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. మీ అందరికీ నచ్చుతుంది.

దర్శకుడు జేసన్ సంజయ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ సినిమా. అక్టోబర్ 2న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అడ్వెంచర్ ఉంటుంది. ఒక ట్రెజర్ హంట్ లాంటి సినిమా. అలాగే అందరూ ఎంజాయ్ చేసుకునేలా ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. సినిమా ఫన్ రైడ్‌లాగా ఉంటుంది. నాకు సందీప్ కిషన్ గారి సినిమాల్లో ‘భైరవకోన’ చాలా ఇష్టం. అలాగే ఆయన ‘మైఖేల్’ సినిమా నేను తమిళ్‌లో చూశాను. అది చాలా బాగుంటుంది. ఈ సినిమాని మీరందరూ చూసి ఫీడ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాను. నేను కాలేజీలో డైరెక్షన్, స్క్రీన్ రైటింగ్ చదువుకున్నాను. ఫిల్మ్‌లో అన్ని డిపార్ట్‌మెంట్స్‌తో కలిసి పనిచేశాను. ఈ ప్రయాణంలో మా నాన్న, నా కుటుంబం, అభిమానులు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సినిమాతో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఎలాంటి సినిమా చేశానో చూడటానికి మా నాన్నగారు ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. మేము ఈ కథ అనుకున్నప్పుడే బైలింగ్వల్‌గా చేయాలనుకున్నాము. తమన్ గారు వచ్చిన అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అక్టోబర్ 2న థియేటర్స్‌లో కలుద్దాం.

ఫారియా అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘సిగ్మా’తో తమిళ్‌లో డెబ్యూ చేస్తున్నా. లైకా ప్రొడక్షన్స్‌కి థాంక్యూ. చాలా అద్భుతంగా ఈ సినిమాని చేశారు. పక్కా కమర్షియల్ సినిమా లాగా ఉంటుంది. అదే సమయంలో చాలా కొత్తగా ఉంటుంది. సంజయ్ సినిమాని చదువుకున్నాడు. తనకు సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉంది. తమిళ్‌లో నేను డబ్బింగ్ చెప్పాను. ఈ సినిమా చాలా ఫన్ రైడ్‌గా ఉంటుంది. తమన్ గారి మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంటుంది. మైత్రీ మూవీ మేకర్స్‌తో కొలబారేట్ కావడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.

మైత్రీ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అక్టోబర్ రెండో తేదీన ‘సిగ్మా’ వస్తుంది. కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మరో పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాము. సందీప్ గారు, సంజయ్ గారి కాంబినేషన్ చాలా పెద్ద విజయం సాధించాలని ఆశిస్తున్నాను. మీ అందరికీ కృతజ్ఞతలు. తప్పకుండా ఇది చాలా పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.