Skip to content

భక్తిశ్రద్ధలతో గణేశుడికి పూజలు

వినాయక చవితి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రాజేంద్రనగర్‌ ఉప్పరపల్లిలోని స్వాగత్‌ డిలైట్‌ అపార్ట్‌మెంట్స్‌లో బుధవారం గణేశుడికి భక్తిశ్రద్ధలతో పూజలు జరిపించారు. వేదపండితులు శ్రీ. పరాశర. శ్రీరామ బట్టాచార్యా గార్ల ఆధ్వర్యంలో పూజలు కన్నుల పండువగా జరిగాయి. ఈ సందర్భంగా గణ నాథుడిని ప్రత్యేకంగా అలంకరించారు. అపార్ట్‌మెంట్‌వాసులతో పాటు పిల్లలు కూడా ఈ పూజల్లో ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. గణేశుడి పూజ అనంతరం అపార్ట్‌మెంట్స్‌వాసులకు తీర్థ, ప్రసాదాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాల ఆర్‌ఐ నర్వ స్వాతి, లోకేశ్వర్‌ రెడ్డి–శారదా దేవి, చత్రేష్‌ రెడ్డి–కార్తికేయ రెడ్డి, చైతన్యా రెడ్డి–ఇందిరా ప్రియదర్శిని, మోక్ష ఆదిత్య రెడ్డి–కావిన్య రెడ్డి, దేవి వల్లభనేనితో పాటు పలువురు స్వాగత్‌ డిలైట్‌ అపార్ట్‌మెంట్‌వాసులు పాల్గొన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.