Skip to content

నరేష్ విజయకృష్ణకు గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు సత్కారం

వెర్సటైల్ యాక్టర్ నవరసరాయ డా. నరేష్ విజయకృష్ణకు అరుదైన గౌరవం లభించింది. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 76వ జన్మదినోత్సవం సందర్భంగా గోవా రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గోవా గౌరవనీయ గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు, డా. నరేష్‌ను ఘనంగా సత్కరించారు. భారతీయ సినీ పరిశ్రమలో 55 ఏళ్ల సుదీర్ఘ, విశిష్ట ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా గవర్నర్ డా. నరేష్‌ను అభినందించి రాజ్‌భవన్‌లో సత్కరించారు. గోవాలోని తెలుగు కమ్యూనిటీ సభ్యులు డా. నరేష్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను లోక్‌భవన్‌కు ఆహ్వానించగా, అక్కడ చారిత్రాత్మక భవనాన్ని సందర్శించారు. గౌరవనీయ గవర్నర్ ఆయనకు టీ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో డా. నరేష్…

Read more

‘G2’ 2027 ఫిబ్రవరి 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

బ్లాక్ బస్టర్ స్పై థ్రిల్లర్ గూఢచారికి సిక్వెల్‌గా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘G2’ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. 2027 ఫిబ్రవరి 5న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం, ఫస్ట్ పార్ట్ గూఢచారి సక్సెస్‌ను బేస్‌గా తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నారు ఇండియన్ సినిమాలో స్పై థ్రిల్లర్ జానర్‌ ని రీడిఫైన్ చేయనుంది. ఈసారి ఏజెంట్ 116గా వామికా గబ్బి ఎంట్రీ ఇస్తోంది. యాక్షన్‌తో పాటు ఎమోషన్‌ వున్న క్యారెక్టర్ ఇది. ఈ మూవీలో ఇమ్రాన్ హష్మీ పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. మురళీ శర్మ, సుప్రియా యార్లగడ్డ, మధు శాలిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా…

Read more

వైరల్‌గా మారిన నాని, కయాదు లోహార్ బ్రాండ్ న్యూ పోస్టర్

న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. తాజాగా మేకర్స్ నాని, కయాదు లోహార్‌ను ఇంటెన్స్ రొమాంటిక్ అవతార్‌లో ప్రజెంట్ చేస్తూ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో నాని రఫ్ అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తుండగా, కయదు లోహార్ కూడా ఇంటెన్స్ అవతార్‌లో కనిపించారు. ఇద్దరూ ఎదురెదురుగా నిలబడి.. సిగరెట్స్ ను లైటర్‌తో వెలిగించుకుంటున్న విజువల్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. చుట్టూ ఉన్న డార్క్, ఇంటెన్స్ వాతావరణం మధ్య ఈ సన్నివేశం వారి…

Read more

‘సిగ్మా’ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ : హీరో సందీప్ కిషన్

‘సిగ్మా’ మంచి ఫన్ రైడ్‌లా ఉంటుంది. నాన్నగారు సినిమా కోసం ఎదురుచూస్తున్నారు: డైరెక్టర్ జేసన్ సంజయ్ సందీప్ కిషన్ క్రేజీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ‘సిగ్మా. దర్శకుడిగా జేసన్ సంజయ్ డెబ్యూ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది. టీజర్, సాంగ్స్ మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని కోస్తాంధ్ర, తెలంగాణలో విడుదల చేయనుండగా, ఎన్‌వీఆర్ సినిమా సీడెడ్‌లో రిలీజ్ చేస్తోంది. సిగ్మా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్‌లో హీరో…

Read more

‘సిగ్మా’ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ & ఎన్వీఆర్ సినిమా ద్వారా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్

సందీప్ కిషన్ క్రేజీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ‘సిగ్మా’ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దర్శకుడిగా జేసన్ సంజయ్ డెబ్యూ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది. టీజర్, సాంగ్స్ కూడా మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ‘సిగ్మా’కు మరింత బలం చేకూరింది. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని కోస్తాంధ్ర, తెలంగాణలో విడుదల చేయనుండగా, ఎన్‌వీఆర్ సినిమా సీడెడ్‌లో రిలీజ్ చేస్తోంది. ‘సిగ్మా’కు ఈ అసోసియేషన్ ఒక పెద్ద అడ్వాంటేజ్‌గా నిలవనుంది. తెలుగు మార్కెట్‌లో బలమైన మార్కెట్ ప్రెజెన్స్‌తో పాటు డిస్ట్రిబ్యూషన్‌లో…

Read more

‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ హైలీ ఎంటర్టైనింగ్ టీజర్ రిలీజ్

హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బాబు డెగాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చవాన్, శ్రీధర్ చెని, దీపక్ ముస్త్యాల నిర్మించారు. రాజ్ సుహాస్, ప్రమదేశ్వి వి క్రియేటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. సెప్టెంబర్ 30 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ETV Winలో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. హర్ష ఫాదర్ ఎవరినైనా ప్రేమించమని చెప్పే సన్నివేశంతో మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. టీజర్‌లో ఫన్ అలరించింది. హర్ష టైమింగ్ అదిరిపోయింది. హైపర్ ఆది పంచులు మరో హైలైట్‌గా నిలిచాయి. జీవన్ కుమార్, ఐశ్వర్య హోలక్కల్, శ్రావ్య చౌదరి ఇతర కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. అజయ్…

Read more

‘ది ప్యారడైజ్’ గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: సంపూర్ణేష్ బాబు

న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంపూర్ణేష్ బాబు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. బిర్యాని క్యారెక్టర్ తో అందరినీ సర్ ప్రైజ్ చేశారు కదా? -డైరెక్టర్ శ్రీకాంత్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. వెళ్లి కలిసాను. అందులో బిర్యాని క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటివరకు…

Read more

#KA13 వినాయక చవితి స్పెషల్ పోస్టర్‌ రిలీజ్

ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లో సరికొత్త దశలోకి అడుగుపెడుతున్నారు. 'క', 'కె-ర్యాంప్' వరుస విజయాలతో అదరగొడుతున్న కిరణ్ అబ్బవరం, ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ అయిన #KA13తో బిజీగా ఉన్నారు. 'SR కళ్యాణమండపం'తో కథా రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన, ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, హీరోగా అన్ని బాధ్యతలను స్వయంగా స్వీకరించారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతోంది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ చాగంటి తొలిసారి నిర్మాతగా మారి జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ ఎర్ర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే “Ek Dum Bindass Pakaane Waale” అనే…

Read more

శ్రీ విష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్’ 2027 సంక్రాంతికి రిలీజ్

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు తనకు బాగా సూటయ్యే కథలను ఎంచుకుంటూ తన అద్భుతమైన కామిక్ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తుంటారు. తాజాగా మరో ఆసక్తికరమైన ఎంటర్‌టైనర్‌తో వస్తున్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో, ప్రముఖ పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తుండగా, అనిల్ యెర్నేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘సామజవరగమన’ తర్వాత శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. అంతేకాదు, రామ్ అబ్బరాజు గత బ్లాక్‌బస్టర్ నారి నారి నడుమ మురారి’లో శ్రీ విష్ణు క్యామియో రోల్‌లో కనిపించారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన సాక్షి మధోల్కర్ హీరోయిన్‌గా…

Read more

సిద్ధు జొన్నలగడ్డ లాంచ్ చేసిన ‘అనుమాన పక్షి’ ట్రైలర్‌

‘డీజే టిల్లు’తో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన విమల్ కృష్ణ.. మరో క్విర్కీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అనుమాన పక్షి’. రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా.. హ్యూమర్, క్యారెక్టర్స్, కథనంలో పూర్తిగా డిఫరెంట్ గా ఉండబోతోంది. చిలక ప్రొడక్షన్స్ సమర్పణలో రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాగ్ మయూర్ సరసన మెరిన్ ఫిలిప్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 18న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హీరో సిద్ధు జొన్నలగడ్డ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ప్రతి విషయాన్నీ అతిగా ఆలోచించే సన్నీ.. తన చుట్టూ జరిగే దాదాపు ప్రతిదాంట్లోనూ ఏదో అనుమానాస్పదమైన విషయం…

Read more