ఒక సామాన్యుడు తెగిస్తే కుటుంబం కోసం ఎంతదూరం వెళ్తాడో అదే ఈ ‘ఆదర్శ కుటుంబం’ :…
‘పవర్‌పేట’ నుంచి రితికా నాయక్ ఫస్ట్ లుక్ రిలీజ్
సందీప్ కిషన్ హీరోగా, కృష్ణ చైతన్య రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘పవర్‌పేట’. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నేతృత్వంలోని సక్సెస్‌ఫుల్ నిర్మాణ సంస్థ 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇంటెన్స్ క్యారెక్టర్లు, డ్రామాతో కూడిన పవర్‌ఫుల్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే మేకర్స్ సందీప్ కిషన్‌ను సేనాపతి రవిగా పరిచయం చేస్తూ పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ప్రేమ, గౌరవం, రాజకీయాల కలయికగా ఈ కథ ఉండబోతోందనే ఆసక్తిని ఆ గ్లింప్స్ కలిగించింది.
వరుస బ్లాక్‌బస్టర్స్ ‘మిరాయ్’, ‘కొరియన్ కనకరాజు’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రితికా నాయక్.. ‘పవర్‌పేట’లో సందీప్ కిషన్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు. రితికా నాయక్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె పాత్రను పడమటవీధి జానకిగా పరిచయం చేశారు. సంప్రదాయబద్ధమైన, అందమైన లుక్‌లో కనిపిస్తున్న రితికా నాయక్.. పాతకాలపు ఇంట్లో చెక్క బెంచీపై హుందాగా కూర్చుని ఆకట్టుకుంటున్నారు. క్రీమ్ కలర్ హాఫ్ సారీ, పీచ్ కలర్ దుపట్టా, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో పాటు సంప్రదాయ ఆభరణాలు, ఉంగరాల జుట్టు ఆమె లుక్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ప్రశాంతమైన హావభావాలతో పడమటవీధి జానకిగా రితికా ఆకట్టుకుంటున్నారు.
మేకర్స్ రితికా నాయక్ గ్రేస్, చార్మ్‌తో పాటు ఆమె ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్‌ను చూపిస్తూ ఆసక్తికరమైన గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో రితికా వివిధ లుక్స్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఓవర్‌సైజ్డ్ షర్ట్‌లో ఆమె లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాత్రలోని విభిన్న కోణాలను పరిచయం చేసిన ఈ గ్లింప్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.
దర్శకుడు కృష్ణ చైతన్య తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా ‘పవర్‌పేట’ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయింది. రితికా నాయక్ రాకతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. మధీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్. రామకృష్ణ, మోనికా ప్రొడక్షన్ డిజైన్‌ను చూసుకుంటుండగా, సచిన్ సుధాకరన్, హరిహరన్ సౌండ్ డిజైన్ .
నటీనటులు: సందీప్ కిషన్, రితికా నాయక్
రచన, దర్శకత్వం: కృష్ణ చైతన్య
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
బ్యానర్: 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: మధీ
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ, మోనికా
సౌండ్ డిజైన్: సచిన్ సుధాకరన్, హరిహరన్
పీఆర్వో: వంశీ-శేఖర్

