Skip to content

‘అలియాస్ రుక్మిణి’ నుంచి ‘రుక్కు రుక్కు రుక్మిణి’ సాంగ్ రిలీజ్

బ్లాక్‌బస్టర్ సక్సెస్ ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ తర్వాత న్యాచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్ మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతోంది. ‘అలియాస్ రుక్మిణి’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తుండగా, ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మాణంలో ప్రేమ, హాస్యం కలగలిసిన కథతో రూపొందుతున్న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మేకర్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఫస్ట్ సింగిల్ ‘రుక్కు రుక్కు రుక్మిణి’ లవ్ సాంగ్ ను విడుదల చేశారు.

విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఈ పాట వినసొంపైన మెలోడీతో ఆకట్టుకుంటోంది. ఆహ్లాదకరమైన ట్యూన్స్‌కు గిటార్, వయోలిన్‌తో కూడిన చక్కని ఆర్కెస్ట్రేషన్ తోడవడంతో పాటకు మంచి రొమాంటిక్ ఫీల్ వచ్చింది. తనతో కలిసి కోర్టులో పనిచేసే కృష్ణకు, ప్రతిరోజూ తాను వెళ్లే దారిలో కనిపించే స్కూల్ టీచర్ రుక్మిణిపై ప్రేమ కలుగుతుంది. ఆమె రాకతో తన జీవితానికి కొత్త అర్థం వచ్చిందని భావించే కృష్ణ, తన ప్రేమను మనసుకు హత్తుకునే పదాలతో వ్యక్తపరుస్తాడు. అయితే, తన ప్రేమను రుక్మిణికి చెప్పినప్పుడు ఆమె ఎలా స్పందిస్తుందోననే డైలామాలో ఉంటాడు.

ప్రేమకథకు హాస్యాన్ని జోడిస్తూ ఈ పాటలో ఓ ఆసక్తికరమైన సన్నివేశాన్ని కూడా చూపించారు. కోర్టులో కేసు వాదన సందర్భంగా సాక్ష్యాలు సమర్పించే సమయంలో కృష్ణ, రుక్మిణి ఫొటోను న్యాయమూర్తికి అందిస్తాడు. దీంతో జడ్జి అతడిని మందలిస్తారు. ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన కృష్ణ, వృత్తిపరమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలోనూ రుక్మిణి ఆలోచనల్లోనే ఉంటాడనే విషయాన్ని ఈ సన్నివేశం సరదాగా చూపిస్తుంది.

గీత రచయిత పూర్ణాచారి ప్రేమ, ఆరాధన భావాలను అందంగా వ్యక్తపరిచే సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి వోకల్స్ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. విజువల్స్ కూడా మెలోడీకి చక్కగా సరిపోయాయి. నితిన్‌ను సాధారణ మధ్యతరగతి యువకుడైన కృష్ణగా, ఆఫియా సయ్యద్‌ను అందమైన రుక్మిణిగా పరిచయం చేశారు.

ఇప్పటికే టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ ద్వారా నితిన్ పాత్రను పరిచయం చేశారు. విభిన్నమైన హాస్యం, ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్‌తో ఆ గ్లింప్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ప్రత్యేక గ్లింప్స్ ద్వారా హీరోయిన్ ఆఫియా సయ్యద్‌ను పరిచయం చేశారు. ఇందులో ఆమె క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చే స్కూల్ టీచర్ రుక్మిణిగా కనిపించారు.

ఈ చిత్రానికి జోమోన్ టీ. జాన్ ఐఎస్‌సీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ నిర్వర్తిస్తుండగా, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్

ఈ సినిమా డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మంచి జోష్‌తో ప్రారంభించిన ‘అలియాస్ రుక్మిణి’ ఫస్ట్ సింగిల్ విడుదలైన వెంటనే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది.

నటీనటులు: నితిన్, ఆఫియా సయ్యద్, సాయికుమార్, హర్షవర్ధన్ తదితరులు

సాంకేతిక బృందం
సమర్పణ: నేచురల్ స్టార్ నాని
ప్రొడక్షన్ బ్యానర్: యునానిమస్ ప్రొడక్షన్స్
రచన, దర్శకత్వం: మురళీకాంత్ దేవసోత్
నిర్మాత: దీప్తి గంటా
సినిమాటోగ్రఫీ: జోమోన్ టీ. జాన్ ఐఎస్‌సీ
సంగీతం: విజయ్ బుల్గానిన్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రశాంత్ మండవ
కాస్ట్యూమ్ డిజైనర్: రేఖ బొగ్గరపు
పబ్లిసిటీ డిజైనర్: భరణీధరన్
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్వో: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.