‘వృషకర్మ’ పూర్తి కావస్తున్న షూటింగ్- బిటిఎస్ స్టిల్స్ రిలీజ్
తండేల్ బ్లాక్ బస్టర్ విజయంతో అద్భుతంగా సాగుతున్న యువ సామ్రాట్ నాగ చైతన్య, తన తొలి బ్లాక్‌బస్టర్ 'విరూపాక్ష'తో ఆకట్టుకున్న ఫిల్మ్ మేకర్ కార్తీక్ దండుతో కలిసి ప్రతిష్టాత్మక మిథికల్ థ్రిల్లర్ 'వృషకర్మ' చేస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ అద్భుతమైన రెస్పాన్స్ తో 20 మిలియన్ వ్యూస్ దాటి దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొల్పింది. ప్రస్తుతం ‘వృషకర్మ’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా రాజస్థాన్‌లో జరిగిన భారీ షెడ్యూల్‌కు సంబంధించిన బీహైండ్ ది సీన్స్ స్టిల్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. రాజభవనాలు, పురాతన శిల్పకళతో అలరారుతున్న లొకేషన్స్‌లో…
