హోంబలే ఓవర్సీస్ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్లో మరో మైలురాయి ‘హనుమాన్ అంశ్’ విజయ పరంపర ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది…
‘మండాడి’ టీంను అభినందించిన కమల్ హాసన్
ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన ‘మండాడి’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ మూవీలో సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి సెప్టెంబర్ 10న రిలీజ్ చేశారు. ఆల్రెడీ వంద కోట్ల క్లబ్బులో చేరిన ‘మండాడి’ వరల్డ్ వైడ్‌గా ఇంకా దూసుకుపోతోంది.
‘మండాడి’ బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా ఇప్పటికే రజినీకాంత్ టీంకి అభినందనలు తెలియజేశారు. ఇక తాజాగా లోక నాయకుడు కమల్ హాసన్ ‘మండాడి’ టీంని అభినందించారు. ప్రత్యేకంగా టీంని కలిసి ప్రతీ ఒక్కరితో మాట్లాడి ‘మండాడి’ గురించి గొప్పగా ప్రశంసించారు. దర్శక, నిర్మాతలో పాటుగా సూరి, సుహాస్, రవీంద్ర విజయ్ అందరినీ కమల్ హాసన్ ప్రత్యేకంగా కలిసి, అందరితో మాట్లాడి, బెస్ట్ విషెస్‌ను తెలియజేశారు.
‘నా జీవితంలో మర్చిపోలేని ఓ ఘటన. ఈ రోజుని ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మా ‘మండాడి’ టీం మీద డా. కమల్ హాసన్ సర్ కురిపించిన ప్రేమ, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం, చెప్పిన మాటలు మాకు ఎంతో ప్రత్యేకం. మాకు ఈ అవకాశం కల్పించిన మహేంద్రన్ అన్నకి, డిస్నీ బ్రదర్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు’ అని సూరి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘మండాడి’ సినిమాలోని బోట్ సీక్వెన్స్, రేసింగ్ సీన్స్‌కి ఆడియెన్స్ నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ‘మండాడి’ చిత్రానికి కథిర్ అందించిన విజువల్స్, జీవీ ప్రకాష్ బీజీఎం, పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ప్రధాన బలాలుగా మారాయి. సూరి, సుహాస్ నటన, వారి పాత్రలు సినిమాని మరో స్థాయికి తీసుకు వెళ్లాయి.
నటీనటులు : సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్ : ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్
సమర్ఫణ : ఎల్రెడ్ కుమార్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వెట్రిమారన్
నిర్మాత : ఎల్రెడ్ కుమార్
సహ నిర్మాత : మణికందన్
దర్శకుడు : మతిమారన్ పుగళేంది
సంగీతం : జి.వి. ప్రకాష్ కుమార్
కెమెరామెన్ : ఎస్.ఆర్. కథిర్
ఎడిటింగ్ : ప్రదీప్ ఇ. రాఘవ్
యాక్షన్ : పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ
ప్రొడక్షన్ డిజైన్ : డి.ఆర్.కె. కిరణ్
పీఆర్వో : సాయి సతీష్

