Skip to content

హనుమాన్ అంశ్ రికార్డ్

హోంబలే ఓవర్సీస్ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్‌లో మరో మైలురాయి

‘హనుమాన్ అంశ్’ విజయ పరంపర ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. సెప్టెంబర్ 11న అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైన ఈ చిత్రం కేవలం 12 రోజుల్లోనే ఓవర్సీస్‌లో $3.5 మిలియన్+ కలెక్షన్స్ సాధించింది. దీంతో 2026లో అత్యధిక ఓవర్సీస్ గ్రాసర్స్‌లో రెండో స్థానంలో నిలిచింది.

ఓవర్సిస్ లో ‘హనుమాన్ అంశ్’కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. కేవలం 12 రోజుల్లోనే ఓవర్సీస్‌లో బలమైన రన్‌ను కొనసాగిస్తున్న ఈ చిత్రం.. భక్తి, విశ్వాసం, మహారాజ్జీ విలువలను అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ చేసింది.

‘హనుమాన్ అంశ్’ ఓవర్సీస్‌లో సాధిస్తున్న ఈ అద్భుతమైన వసూళ్లు హోంబలే ఓవర్సీస్ కు కూడా మరో కీలక మైలురాయిగా నిలిచాయి. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్‌లో క్రమంగా తన పరిధిని విస్తరిస్తున్న హోంబలే ఓవర్సీస్.. భారతీయ కథలను గ్లోబల్ ఆడియన్స్‌కు చేరువ చేయడంపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. బలమైన సాంస్కృతిక, భావోద్వేగ అనుబంధం ఉన్న సినిమాలను ప్రపంచ ప్రేక్షకులకు తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తోంది.

‘హనుమాన్ అంశ్’ ప్రత్యేకమైన విజయగాథగా నిలిచింది. భక్తి, విశ్వాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా.. ఇప్పుడు సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. కేవలం 12 రోజుల్లోనే $3.5 మిలియన్+ ఓవర్సీస్ కలెక్షన్స్ సాధించడం అంతర్జాతీయంగా సినిమాకు లభిస్తున్న అసాధారణ స్పందనకు నిదర్శనంగా నిలిచింది.

ఈ సినిమా అసాధారణ ఓవర్సీస్ విజయంపై ‘హనుమాన్ అంశ్’ నిర్మాత మాట్లాడుతూ: “హోంబలే ఓవర్సీస్ మా కోసం హనుమాన్‌జీ కే దూత్స్‌లా నిలిచారు. వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మహారాజ్జీ విలువలను ప్రపంచానికి చేరవేసినందుకు ‘హనుమాన్ అంశ్’ ప్రేక్షకులు, మేకర్స్ ఎప్పటికీ వారికి కృతజ్ఞులుగా ఉంటారు. మహారాజ్జీ ‘విశ్వ ఆయేగా’ అన్నారు.. ఇదిగో మనం ఇక్కడ ఉన్నాం.” అని అన్నారు.

కేవలం 12 రోజుల్లో $3.5 మిలియన్+ సాధించిన ఈ మైలురాయి ‘హనుమాన్ అంష్’ విజయగాథలో మరో ప్రత్యేక అధ్యాయాన్ని జోడించింది. అదే సమయంలో భారతీయ సినిమా, ముఖ్యంగా సంస్కృతి, విశ్వాసాలతో ముడిపడిన కథలను ప్రపంచ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడంలో హోంబలే ఓవర్సీస్ మరింత కీలక పాత్ర పోషిస్తోందని ఈ విజయం మరోసారి చాటింది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.