ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్ మీద సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో మతిమారన్…
తిరుమల శ్రీవారి శాలకట్ల బ్రహ్మోత్సవా ల్లో పాల్గొన్న నందమూరి వసుంధర
తిరుమల, 23 సెప్టెంబర్ 2026: నటుడు, ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ గారి సతీమణి శ్రీమతి వసుంధర గారు, తిరుమలలో శ్రీవారి శాలకట్ల బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, శ్రీమతి వసుంధర గారిని ఎస్‌విబిసి ఛైర్మన్ శ్రీ బి. శ్రీధర్ వర్మ గారు, వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఆశీర్వాదాలు పొందారు. శ్రీధర్ వర్మ గారికి వసుంధర దేవి గారు ఎస్విబిసి చైర్మన్ గా ఎన్నికైనందుకుగాను శుభాకాంక్షలు తెలిపి ఆయనను అభినందించారు. అలాగే ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ గారు కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని శ్రీధర్ వర్మ గారు ఆకాంక్షించారు. శ్రీధర్ వర్మ గారి కుటుంబసభ్యులును ఇలా కలవడం తామేకు చాలా ఆనందంగా ఉంది అని వసుంధర గారు సంతోషం వ్యక్తపరిచారు. వారితో పాటు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, ముద్దాడ రవిచంద్ర, జేఈవో శరత్, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీవీఎస్ఓ) మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, టిటిడి బోర్డు మెంబర్ భాను ప్రకాష్ గారు, ఇతర బోర్డు మెంబర్స్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

