నాగ చైతన్య ‘వృషకర్మ’ డిసెంబర్ 4న రిలీజ్
యువ సామ్రాట్ నాగ చైతన్య మోస్ట్ ఎవైటెడ్ మైథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ మరోసారి అధికారికంగా ధృవీకరించారు. కార్తీక్ దండు దర్శకత్వంలో ఎస్విసిసి, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మునుపెన్నడూ చూడని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను అందించబోతోంది. బాపినీడు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలను ఎవరూ టచ్ చేయని ఒక సరికొత్త నేపథ్యంలో ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. సినిమా విడుదలకు 50 రోజుల కౌంట్డౌన్ను పురస్కరించుకుని మేకర్స్ సరికొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో నాగ చైతన్య స్టైలిష్గా, యాక్షన్ అవతార్లో కనిపిస్తున్నారు. పదునైన…
