Skip to content

‘వృషకర్మ’ లార్జ్ స్కేల్ థియేట్రికల్ స్పెక్టికల్. డిసెంబర్ 4న మీరు భారీ అంచనాలతో థియేటర్లకు రండి – నాగ చైతన్య

  • యువ సామ్రాట్ నాగ చైతన్య, కార్తీక్ దండు, ఎస్వీసీసీ & సుకుమార్ రైటింగ్స్ ‘వృషకర్మ’ నుంచి మనసును హత్తుకునే మెలోడీ ‘ఛలో పదవే’ రిలీజ్

యువ సామ్రాట్ నాగ చైతన్య ‘వృషకర్మ’ సినిమాతో ప్రేక్షకులను మైథాలజీ, మిస్టరీతో కూడిన ఆసక్తికరమైన ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక థ్రిల్లర్ పురాతన రహస్యాలు, దాగి ఉన్న నిజాలు, ఉత్కంఠభరితమైన అంశాల చుట్టూ సాగుతుంది. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను బాపినీడు సమర్పిస్తున్నారు. రిచ్ విజువల్స్, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ప్రేక్షకులకు బిగ్ స్క్రీన్‌పై కొత్త అనుభూతిని అందించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈ సినిమా మ్యూజికల్ జర్నీని ఫస్ట్ సింగిల్ ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’తో గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ పాటలో హీరో స్టైల్, ఆటిట్యూడ్, ఎనర్జిటిక్ పర్సనాలిటీని చూపించడంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు విడుదలైన రెండో పాట ‘ఛలో పదవే’ సినిమాలోని మరో ఎమోషనల్ కోణాన్ని పరిచయం చేస్తోంది. మొదటి పాటలోని ఎనర్జీకి భిన్నంగా, ఈసారి మనసును హత్తుకునే మెలోడీతో కథలోని సున్నితమైన భావోద్వేగాలను చూపించారు.

అజనీష్ బి లోక్‌నాథ్ అందించిన సంగీతం పాటకు మంచి ఫీల్ తీసుకొచ్చింది. ఆకట్టుకునే మ్యూజికల్ అరేంజ్‌మెంట్‌తో భావోద్వేగాలను చక్కగా పలికించారు. అనంత శ్రీరామ్ రాసిన అర్థవంతమైన సాహిత్యం జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాల్సిన ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. సాయి విఘ్నేష్ తన వాయిస్‌తో పాటకు మరింత ఎమోషనల్ డెప్త్ తీసుకొచ్చారు. చిన్నారి గొంతుతో వచ్చే వోకల్స్ పాటలోని అమాయకత్వాన్ని, అందాన్ని మరింత పెంచాయి.

నాగ చైతన్య, కియారా ఖన్నా మధ్య ఉండే ప్రత్యేకమైన అనుబంధాన్ని ఈ పాట చాలా అందంగా చూపిస్తుంది. చూపు లేని చిన్నారి అయినప్పటికీ, ఎంతో అమాయకంగా, తెలివిగా ఉంటుంది. ఆమె జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించేలా అర్జున్ తన కళ్లుగా మారి అండగా నిలుస్తాడు. వీరిద్దరి మధ్య ఉండే ఆప్యాయత, అనుబంధం హీరోలోని మరో ఎమోషనల్ కోణాన్ని పరిచయం చేస్తుంది. ఈ పాటలో మీనాక్షి చౌదరి, జయరామ్, సత్య కూడా కనిపించారు. వీరంతా కలిసి ప్రయాణం చేసే క్రమంలో వచ్చే ఆహ్లాదకరమైన, మనసును తాకే సన్నివేశాలు పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.ఈ సినిమాలో స్పర్ష్ శ్రీవాస్తవ విలన్ పాత్రలో నటిస్తున్నారు. టెక్నికల్‌గా ఈ సినిమాకు రాగుల్ డి హెరియన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్, నవీన్ నూలి ఎడిటింగ్.

సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో నాగ చైతన్య మాట్లాడుతూ.. మీ ఎనర్జీ చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంది. ‘ఛలో పదవే’ పాట మీ అందరికీ నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ పాటకు అజ్నీస్ గారి మ్యూజిక్, అనంత శ్రీరామ్ గారి లిరిక్స్ చాలా బాగా కుదిరాయి. ఇవన్నీ కూడా ఈ సినిమాలో నాకు ఫేవరెట్‌. ఈ సినిమా డిసెంబర్ 4న రిలీజ్ అవుతుంది. ఇందులో నేను అర్జున్ అనే పాత్రలో నటించాను. తను ఒక ట్రెజర్ హంటర్. ఈ సినిమాలోని ప్రతి లేయర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఫ్రెష్‌గా ఉంటుంది. డైరెక్టర్ కార్తీక్ ప్రతి క్యారెక్టర్‌ను ఒక కొత్తగా ప్రజెంట్ చేశారు. ఇది ఒక లార్జ్ స్కేల్ థియేట్రికల్ స్పెక్టికల్. తెలుగు ఆడియన్స్‌కు చాలా కొత్తగా ఉండబోతోంది. మీరు భారీ అంచనాలతో రండి. కచ్చితంగా మీ అంచనాలను అందుకుంటామని నమ్ముతున్నాం. డిసెంబర్ 4న థియేటర్లలో కలుద్దాం.

నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. నేను అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమానిని. ఇప్పుడు నాగచైతన్యతో సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాగ్జరున గారితో కూడా సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ‘వృషకర్మ’ అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా కోసం చాలా గొప్ప ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పనిచేశారు. ఇందులో నాగచైతన్య గారు ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నారు. ఈ సినిమా కచ్చితంగా చాలా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాము.

నటీనటులు: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి, స్పర్ష్ శ్రీవాస్తవ, జయరామ్, కియారా ఖన్నా, సత్య

టెక్నికల్ టీం:
దర్శకత్వం: కార్తీక్ దండు
నిర్మాతలు: బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్
సమర్పణ: బాపినీడు
సంగీతం: అజనీష్ బి లోక్‌నాథ్
సినిమాటోగ్రఫీ: రాగుల్ డి హెరియన్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరసింహ చారి చెన్నోజు
మార్కెటింగ్: హ్యాష్‌ట్యాగ్ మీడియా

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.