Skip to content

‘టైసన్ నాయుడు’ అదిరిపోయే యాక్షన్ రైడ్‌ టీజర్‌ రిలీజ్

యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టైసన్ నాయుడు’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటివరకు చూడని డిఫరెంట్ మాస్ అవతార్‌లో ఆయన కనిపిస్తుండటంతో ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే ప్రత్యేకమైన పాత్రగా నిలవనుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తుండగా, హరీష్ కట్ట ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టైటిల్ అనౌన్స్‌మెంట్, గ్లింప్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ కూడా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. జానపద బీట్స్, రిచ్ విజువల్స్, ఆకట్టుకునే ప్రెజెంటేషన్‌తో ఈ పాట ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. తాజాగా మేకర్స్ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ అదిరిపోయే యాక్షన్ రైడ్‌ను ప్రామిస్ చేస్తోంది.

పోలీసుల విభాగంలో SOT (స్పెషల్ ఆపరేషన్స్ టీమ్) పేరుతో ఒక ప్రత్యేకమైన ఫాంటమ్ వింగ్‌ను ఏర్పాటు చేస్తారు. ఇబ్బందులు సృష్టించే వ్యక్తులు, పదే పదే నేరాలకు పాల్పడే వారిని తమదైన పద్ధతుల్లో ఎదుర్కోవడం ఈ టీమ్ పని. సాధారణ పోలీసు విధానాలకు భిన్నంగా పనిచేసే ఈ టీమ్, అరెస్టులు చేయకుండా, అధికారిక రికార్డులు నిర్వహించకుండా అక్కడికక్కడే శిక్షించే విధానాన్ని అనుసరిస్తుంది. మరోవైపు నగరంలో వరుసగా జరుగుతున్న నేరాలు ఆందోళన కలిగిస్తాయి. వాటి వెనుక భారీ కుట్ర జరుగుతోందని కథానాయకుడు గుర్తిస్తాడు.

‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాలతో తన ప్రతిభను నిరూపించుకున్న సాగర్ కె చంద్ర, ఈసారి ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌తో వస్తున్నారు. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ, అసలు కథను పూర్తిగా బయటపెట్టకుండా ప్రధాన సంఘర్షణ చుట్టూ ఉత్కంఠను పెంచుతుంది. అనీత్, ముకేష్ జ్ఞానేష్ సినిమాటోగ్రఫీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌ను చాలా రా అండ్ గ్రిటీగా చూపించింది. భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టెన్షన్‌ను మరింత పెంచింది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన యాక్షన్ హల్క్ ఇమేజ్‌కు తగ్గట్టుగా స్పెషల్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ పాత్రకు మంచి బలాన్ని ఇచ్చాయి. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రజ్ఞా జైస్వాల్ కనిపించిన తీరు ఆమె పాత్రలో ఏదో మిస్టరీ ఉందనే ఆసక్తిని కలిగిస్తోంది. నరేష్, సునీల్, రావు రమేష్ పాత్రలకు సంబంధించిన కొన్ని షాట్స్ టీజర్‌లో ఆసక్తికరంగా ఉన్నాయి.

కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ అందిస్తున్నారు. విజయ్ పోలాకి, భాను మాస్టర్స్ రూపొందించిన యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తున్నాయి.

మొత్తంగా ‘టైసన్ నాయుడు’ టీజర్ హై ఆక్టేన్ యాక్షన్, క్రైమ్, సస్పెన్స్ డిఫరెంట్ కథాంశం, ఇంటెన్స్ ప్రెజెంటేషన్, పవర్‌ఫుల్ యాక్షన్ బ్లాక్స్‌తో సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

నటీనటులు:
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నేహా శెట్టి, ప్రజ్ఞా జైస్వాల్, నరేష్, సునీల్, రావు రమేష్

టెక్నికల్ క్రూ:
రచన, దర్శకత్వం: సాగర్ కె చంద్ర
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట
బ్యానర్: 14 రీల్స్ ప్లస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్ట
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: అనీత్, ముకేష్ జ్ఞానేష్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఫైట్స్: స్టన్ శివ, విజయ్, వెంకట్, రియల్ సతీష్
పీఆర్వో: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.