‘టైసన్ నాయుడు’ నుంచి మదరాసి రబ్బరు బొమ్మ సాంగ్ 6న రిలీజ్
యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టైసన్ నాయుడు’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టైటిల్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ను కిక్‌స్టార్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ ను నవంబర్ 6న విడుదల చేయనున్నారు. ఇది మాస్ ఫోక్ సాంగ్‌గా అలరించనుంది. తాజాగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో హీరో, హీరోయిన్ సంప్రదాయ ఫోక్ లుక్‌లో కనిపిస్తూ, కలర్ ఫుల్ బ్యాక్ డ్రాప్ లో సందడి చేయడం పాటపై మరింత ఆసక్తిని పెంచుతోంది…
