యువ సామ్రాట్ నాగ చైతన్య, కార్తీక్ దండు, ఎస్వీసీసీ & సుకుమార్ రైటింగ్స్ ‘వృషకర్మ’ నుంచి…
‘మ్యాడ్’ ఫేమ్ రామ్ నితిన్ కొత్త సినిమా.. తెలుగు, తమిళ భాషల్లో లవ్‌స్టోరీ!
‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన యువ హీరో రామ్ నితిన్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సోల్జర్స్ ఫ్యాక్టరీ (Soldiers Factory), రెడాక్టెడ్ స్టూడియోస్ (Redacted Studios) సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది. టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం ఓ అందమైన ప్రేమకథగా తెరకెక్కనుంది.
ఈ సినిమాలో రామ్ నితిన్ సరసన ప్రథానా నాథన్ (Prathana Nathan), తేజు అశ్విని (Teju Ashwini)హీరోయిన్లుగా నటిస్తున్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న రామ్ నితిన్‌కు ఈ సినిమా మరో మంచి సినిమా అవుతుందని మేకర్స్ అంటున్నారు.
ఈ సినిమాతో కార్తిక్ జై పళని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గతంలో ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఇప్పుడు తన తొలి సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. ప్రథానా నాథన్ (Prathana Nathan) ‘పార్కింగ్’, ‘టీటీటీ’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘నింజా’ (Ninja) సినిమాలో కథానాయికగా కనిపించనున్నారు.
మరో హీరోయిన్ తేజు అశ్విని ‘ఎన్న సొల్ల పోగిరై’ (Enna Solla Pogirai) సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ప్రస్తుతం అర్జున్ దాస్ హీరోగా నటిస్తున్న ‘సూపర్ హీరో బాబు’ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
దర్శకుడిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న కేఎస్ సినిష్ (KS Sinish) స్థాపించిన నిర్మాణ సంస్థ సోల్జర్స్ ఫ్యాక్టరీ (Soldiers Factory). చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ మంచి కథాంశాలతో సినిమాలను నిర్మిస్తోంది. ఈ సంస్థ నిర్మించిన ‘పార్కింగ్’ (2023) సినిమా మూడు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకుంది.
ఈ బ్యానర్‌పై సత్య, సందీప్ కిషన్ నటించిన తెలుగు చిత్రం ‘వివాహ భోజనంబు’, తమిళ చిత్రం ‘డిక్కిలోనా’ (Dikkiloona) తెరకెక్కాయి. అర్జున్ దాస్ నటిస్తున్న ‘సూపర్ హీరో బాబు’, జీవీ ప్రకాశ్ కుమార్ నటిస్తున్న ‘నింజా’(Ninja) చిత్రాలు కూడా నిర్మాణంలో ఉన్నాయి.
శాంజన్ జి (Shanjan G). స్థాపించిన రెడాక్టెడ్ స్టూడియోస్(Redacted Studios) సంస్థ తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ‘సూపర్ హీరో బాబు’, ‘ఫ్యామిలీ ట్రిప్’ వంటి సినిమాలతో పాటు జయరామ్, సిమ్రాన్ కలయికలో మరో చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఇప్పుడు సోల్జర్స్ ఫ్యాక్టరీతో కలిసి నిర్మిస్తున్న రామ్ నితిన్ సినిమా ద్వారా రెడాక్టెడ్ స్టూడియోస్ (Redacted Studios) తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది.
ఈ కొత్త సినిమా గురించి సోల్జర్స్ ఫ్యాక్టరీ (Soldiers Factory) ప్రతినిధులు మాట్లాడుతూ.. ‘‘రెడాక్టెడ్ స్టూడియోస్ (Redacted Studios) తో కలిసి తెలుగు, తమిళ భాషల్లో సినిమా నిర్మించడం ఆనందంగా ఉంది. మంచి నటీనటులు, కొత్త టాలెంటెడ్ సాంకేతిక బృందంతో ఈ ప్రేమకథను రూపొందిస్తున్నాం.
కొత్తవారిని, కొత్త ఆలోచనలను, విభిన్నమైన కథలను ఎప్పుడూ ప్రోత్సహించడమే మా సంస్థ లక్ష్యం. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తామని ఆశిస్తున్నాం. భవిష్యత్తులోనూ వివిధ భాషల్లో మరిన్ని ఆసక్తికరమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని తెలిపారు.
రామ్ నితిన్ హీరోగా నటిస్తున్న ఈ కొత్త తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం త్వరలోనే మరిన్ని వివరాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. టైటిల్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర బృందం త్వరలో వెల్లడించనుంది.




