Skip to content

ఘనంగా ‘మెడివాకర్స్’ గ్రాండ్ లాంచ్!

▪️ఇంటి వద్దకే సమగ్ర వైద్యం
▪️ డిజిటల్ హెల్త్‌లో కొత్త శకం!
▪️ ఆన్‌లైన్ వైద్య సంప్రదింపుల నుంచి డయాగ్నోస్టిక్స్, ఫార్మసీ వరకు
▪️ ఒకే వేదికపై అన్నీ ర‌కాల హెల్త్ స‌ర్వీసులు

హనుమకొండ: ప్రజలందరికీ నాణ్యమైన, సమగ్రమైన వైద్య సేవలను మరింత సులభంగా చేరువ చేసే దిశగా ఆరోగ్య రంగాన సరికొత్త విప్లవం ఆవిష్కృతమైంది. “కేర్ బియాండ్ బార్డర్స్” అనే ప్రాథమిక ధ్యేయంతో, సాంకేతికత, వైద్యాన్ని సమ్మిళితం చేస్తూ ‘మెడివాకర్స్’ (MediWalkers) సంస్థ ఒక సమగ్ర డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్‌ను ప్రజల ముందుకు తీసుకు వ‌చ్చేసింది. “ది ఫ్యూచర్ ఆఫ్ కేర్ స్టార్ట్స్ హియర్” అనే ఆలోచనాత్మక నినాదంతో రూపుదిద్దుకున్న ఈ వినూత్న వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమం హనుమకొండలోని ప్రముఖ ‘మినర్వా గ్రాండ్’ వేదికగా ఘ‌నంగా జరిగింది.
‘మెడివాకర్స్’ (MediWalkers) సంస్థ ఫౌండర్ మల్లారెడ్డి ఆలుమల్ల మాట్లాడుతూ… నేటి వేగవంతమైన జీవితంలో సమయానికి సరైన వైద్య సలహాలు, సేవలందుకోవడం ఎంతో కీలకమైన అంశంగా మారింది. ఈ సవాలుకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తూ, రోగులు తమ ఇంట్లోనే ఉండి సమస్త వైద్య సేవలను పొందేలా మెడివాకర్స్ రూపకల్పన చేసాము. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా నిపుణులైన వైద్యులతో ప్రత్యక్ష ఆన్‌లైన్ కన్సల్టేషన్లు పొందడమే కాకుండా, క్లిష్టమైన ఆరోగ్య సమస్యలకు సెకండ్ ఒపీనియన్స్ సేకరించేందుకు కూడా సులభమైన మార్గం సుగమమవుతుంది. అంతేకాకుండా, వ్యాధి నిర్ధారణ పరీక్షల సేవలు (డయాగ్నొస్టిక్స్), డోర్ డెలివరీ సౌకర్యంతో కూడిన ఫార్మసీ సేవలు, పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షల ప్యాకేజీలు (హెల్త్ చెక్స్), రోగుల సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడే కంపానియన్ కేర్ సేవలు అన్నీ కూడా ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి.

తెలంగాణ సాంస్కృతిక, విద్యా కేంద్రమైన హనుమకొండలో నిర్వహిస్తున్న ఈ ప్రారంభోత్సవ వేడుకలో వైద్యులు, ఫార్మసిస్టులు, డయాగ్నోస్టిక్ లాబ్ యజమానులు పాల్గొన్నారు. వైద్య రంగానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి, ఆరోగ్య సేవల వ్యవస్థను మరింత పటిష్టం చేసే ఈ బృహత్తర యత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.

ఈ ఆధునిక డిజిటల్ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి రావడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల రోగులకు మెరుగైన వైద్యం త్వరితగతిన అందుతుందని ఆశిస్తున్నారు. మెడివాకర్స్ సేవలు, ప్రారంభోత్సవ వివరాల కోసం www.mediwalkers.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.