Skip to content

‘హై’ సినిమా నుంచి సూపర్ 5 సాంగ్ రిలీజ్

బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి పనిచేయడంతో పాటు, పలు విజయవంతమైన సినిమాలకు కో-రైటర్‌గా వ్యవహరించి గుర్తింపు తెచ్చుకున్న ఎస్ కృష్ణ ఇప్పుడు దర్శకుడిగా అలరించబోతున్నారు. ‘హై’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న ఆయన.. ఈ చిత్రానికి రచయితగా, నటుడిగా కూడా తన ప్రతిభను చాటుతున్నారు. సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. హరీష్ పెద్ది, శేఖర్ దివ్వెలతో కలిసి ఈ చిత్రాన్ని సహ నిర్మాతగా నిర్మిస్తున్నారు.

ఇమేజ్‌స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందుతున్న ‘హై’ భావోద్వేగాలు, ఆసక్తికరమైన డ్రామా, ఎనర్జీతో కూడిన సన్నివేశాలతో ప్రేక్షకులకు ఆకట్టుకునే సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది. అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ‘హై’ నుంచి ‘సూపర్ 5’ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. గ్యాంగ్‌ను పరిచయం చేస్తూ సాగే ఈ పాట అదిరిపోయే ఎనర్జీ, క్యాచీ బీట్‌లతో ఆకట్టుకుంటోంది.

ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది, వికాస్ బడిస ట్యూన్ , అద్వైత్ వోకల్స్ ఎనర్జిటిక్ గా ఉన్నాయి. పిల్లల కోరస్ మరింత ఎనర్జీ జోడించింది. ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రానికి మల్లు నాయక్, సునీల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వికాస బదిసా సంగీతం సమకూరుస్తున్నారు. జీఆర్‌కే శరణ్ రావుల ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా, వి. వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.

నవంబర్ 27న ‘హై’ గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.

నటీనటులు:
అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు)

సాంకేతిక బృందం:
రచయిత – దర్శకుడు: ఎస్ కృష్ణ
నిర్మాతలు: హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల
బ్యానర్లు: ఇమేజ్‌స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, మైరా క్రియేషన్స్
సంగీత దర్శకుడు: వికాస్ బదిసా
ఎడిటర్: జీఆర్‌కే శరణ్ రావుల
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, కిట్టు విస్సాప్రగడ
సినిమాటోగ్రాఫర్లు: మల్లు నాయక్, సునీల్ రెడ్డి (సెకండ్ యూనిట్ డీఓపీ)
కొరియోగ్రాఫర్: శ్రీకాంత్ రౌతు
యాక్షన్: వి. వెంకట్
సౌండ్ డిజైన్: ప్రదీప్ జి
కలరిస్ట్: ఆండ్రియాస్ బ్రూక్ల్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మనాథ్ ఏ. పాటిల్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరీష్
లైన్ ప్రొడ్యూసర్: వి. జానకీ రామ్
పీఆర్ఓ: వంశీ–శేఖర్
మార్కెటింగ్: హ్యాష్‌ట్యాగ్ మీడియా
పబ్లిసిటీ డిజైన్స్: ఆర్‌సీ డిజైన్స్
మ్యూజిక్ లేబుల్: ఆదిత్య మ్యూజిక్
ఈవెంట్ పార్ట్‌నర్: యూవీ మీడియా

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.