Skip to content

27వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ పోటీల్లో ప్రత్యేక అతిథిగా హీరో కృష్ణసాయి

  • సీఆర్‌పీఎఫ్ సేవలపై ప్రశంసల జల్లు

హైదరాబాద్: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని శిల్పారామంలో నిర్వహించిన ‘27వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ పోటీలు (Police Band Display)’ అత్యంత వైభవంగా, కోలాహలంగా జరిగాయి. దేశంలోని అత్యుత్తమ పోలీస్ బ్యాండ్ బృందాలు ప్రదర్శించిన సంగీత విభావరి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ‘పోలీస్ కంప్లైంట్’ చిత్ర హీరో, ‘ఎంఎస్‌కే ప్రమీద శ్రీ ఫిలింస్’ అధినేత, ‘కృష్ణసాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్’ ఛైర్మన్ కృష్ణసాయి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అలాగే సీనియర్ హీరోయిన్ ప్రేమ, ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కూడా ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

సీఆర్‌పీఎఫ్ (CRPF) సేవలకు కృష్ణసాయి ప్రశంసలు:
ఈ సందర్భంగా హీరో కృష్ణసాయి మాట్లాడుతూ, దేశ భద్రతలో, అంతర్గత శాంతిభద్రతల పరిరక్షణలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అందిస్తున్న నిస్వార్థ సేవలను కొనియాడారు. పోలీస్ దళాల్లో క్రమశిక్షణ, ఐక్యత, కళాత్మక నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు ఇలాంటి జాతీయ స్థాయి బ్యాండ్ పోటీలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. నిరంతరం విధి నిర్వహణలో నిమగ్నమయ్యే జవాన్లు తమ సంగీత ప్రతిభతో అందరినీ అలరించడం ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన ప్రశంసించారు.

‘హార్మొనీ ఇన్ సర్వీస్’ (Harmony in Service) నినాదంతో ఎస్‌బీఐ (SBI) సహకారంతో, రెడ్ ఎఫ్‌ఎం (RED FM 93.5) రేడియో భాగస్వామ్యంతో జరిగిన ఈ సంగీత ప్రదర్శనకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి తిలకించారు. పోలీస్ బృందాల సమన్వయం, దేశభక్తి గీతాల ఆలాపనతో శిల్పారామం ప్రాంగణం మారుమోగింది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.