Skip to content

నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ‘పోలీస్ కంప్లైంట్’ స్ట్రీమింగ్

▪️తెలుగు, కన్నడ భాష‌ల్లో జూన్‌లో విడుద‌లైన చిత్రం ▪️ 300 థియేట‌ర్‌ల‌లో విడుద‌లై హిట్ టాక్ హారర్-యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జూన్‌లో థియేటర్లలో విడుదలై మంచి స్పందనతో పాటు సానుకూల సమీక్షలు అందుకున్న ఈ చిత్రం, ఈ శుక్ర‌వారం (జూలై 31) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, కన్నడ భాష‌ల్లో దాదాపు 300 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. విడుదలైన తొలి రోజు నుంచే హారర్, యాక్షన్, థ్రిల్లర్ అంశాల సమ్మేళనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి…

Read more
విజయవంతంగా రెండో వారంలోకి ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం Telugu News

విజయవంతంగా రెండో వారంలోకి ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం

హారర్ థ్రిల్లర్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది. సౌత్ ఇండియన్ టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించారు. ‘అఘోర’, ‘పౌరుషం’, ‘ఆప్త’, ‘దండు’, ‘రాఘవరెడ్డి’, ‘ఆదిపర్వం’ వంటి చిత్రాలతో క్రియేటివ్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన సంజీవ్ మేగోటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వివాదాల నడుమ విడుదలైన ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం అన్ని కేంద్రాల్లో రెండో వారంలోనూ విజయవంతంగా ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతోంద‌ని చిత్ర‌యూనిట్ అనందం వ్య‌క్తం చేసింది. ప్రేక్షకుల ఆదరణతో పలు ప్రాంతాల్లో థియేటర్ల సంఖ్యను కూడా పెంచినట్లు నిర్మాత…

Read more
ఘనంగా ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ Telugu News

ఘనంగా ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్

▪️హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్‌తో వివాదంతో స‌త‌మ‌తం అయ్యాం ▪️ ఇప్పుడు సినిమా విజ‌యంతో సంతోషంగా ఉన్నాం ▪️ విజయానికి కారణమైన ప్రేక్షకులకు కృతజ్ఞతలు: డైరెక్టర్ సంజీవ్ మేగోటి ▪️ ప్రేక్షకుల ఆదరణతో రెండో రోజు నుంచే పెరిగిన థియేటర్లు ▪️ పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా దూసుకుపోతున్న ‘పోలీస్ కంప్లైంట్’ హైదరాబాద్: వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించిన హారర్-యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సినిమాకు అన్ని…

Read more
వరలక్ష్మి  వల్ల ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రానికి  నష్టం: దర్శకుడు సంజీవ్ మేగోటి Telugu News

వరలక్ష్మి వల్ల ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రానికి నష్టం: దర్శకుడు సంజీవ్ మేగోటి

▪️అగ్రిమెంట్ ఉల్లంఘించి ప్రమోషన్స్‌కు దూరం ▪️ సినిమా కాన్సెప్ట్ మాదిరిగానే కర్మ ఆమెను వదిలి పెట్టదు ▪️ దర్శకుడు సంజీవ్ మేగోటి సంచలన వ్యాఖ్యలు ▪️ ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ▪️ జూన్ 12న తెలుగు, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల హైదరాబాద్: హారర్, యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, రొమాన్స్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం జూన్ 12న తెలుగు, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మాణంలో, క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో…

Read more
జూన్ 12న థియేటర్లలోకి ‘పోలీస్ కంప్లైంట్’ Telugu News

జూన్ 12న థియేటర్లలోకి ‘పోలీస్ కంప్లైంట్’

హారర్, యాక్షన్, థ్రిల్లర్ అంశాల సమ్మేళనంగా రూపొందిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పోలీస్ కంప్లైంట్’ జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించిన ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రచార గీతాలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా చిత్రంలో సూపర్‌స్టార్ కృష్ణకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతం మరింత ఆకర్షణగా నిలిచింది. ఈ పాటను వీక్షించిన సూపర్‌స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. పాట అద్భుతంగా వచ్చిందని ప్రశంసిస్తూ, సినిమా ఘన విజయం సాధించాలని తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ…

Read more
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్, స్పెషల్ సాంగ్స్ లాంచ్ Telugu News

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్, స్పెషల్ సాంగ్స్ లాంచ్

▪️కృష్ణ సినిమాల‌ను గుర్తు చేస్తూ సాగే ప్ర‌త్యేక‌ పాట‌ ▪️ 52 మంది ఆర్టిస్టులతో 45 రోజుల్లో సినిమా పూర్తి ▪️ క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరెక్కించిన మూవీ ▪️ జూన్ 12న థియేట‌ర్‌లో విడుద‌ల కానున్న చిత్రం హైదరాబాద్: టాలీవుడ్ సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి హారర్ థ్రిల్లర్ అంశాలతో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోతోంది. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మాణంలో, క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన‌ హారర్-యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర…

Read more
మే 22న ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం రిలీజ్ Telugu News

మే 22న ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం రిలీజ్

సంజీవ్ మేగోటి దర్శకత్వంలో హారర్–యాక్షన్ థ్రిల్లర్ ▪️ న‌టుడు కృష్ణ‌సాయి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సూప‌ర్ స్టార్ కృష్ణ‌పై స్పెష‌ల్ సాంగ్ విడుద‌ల‌ ▪️ 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో భారీ స్థాయిలో నిర్మాణం ▪️ వరలక్ష్మి శరత్‌కుమార్ కొత్త షేడ్స్ - నవీన్ చంద్ర వెర్సటైల్ రోల్ ▪️ విభిన్న కథ, పవర్‌ఫుల్ పాత్రలతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ విలనిజం అయినా, క్యారెక్టర్ రోల్ అయినా.. తనదైన పవర్‌ఫుల్ నటనతో స్క్రీన్‌పై మ్యాజిక్ చేసే నటి వరలక్ష్మి శరత్‌కుమార్. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో వెర్సటైల్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ చంద్ర. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ సరికొత్త, భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు…

Read more
బెంగళూరులో ఘనంగా ‘పోలీస్ కంప్లైంట్’ టీజర్ విడుదల Telugu News

బెంగళూరులో ఘనంగా ‘పోలీస్ కంప్లైంట్’ టీజర్ విడుదల

▪️సినీ ప్రముఖుల సమక్షంలో కన్నడ వెర్షన్ టీజర్ విడుద‌ల‌ ▪️ వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర ప్ర‌ధాన పాత్ర‌లు ▪️ 45 రోజుల్లో 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో షూటింగ్ బెంగళూరు: సౌతిండియా ప్రేక్ష‌కుల ముందుకు యాక్షన్, కామెడీ, హారర్ థ్రిల్లర్ క‌ల‌గ‌లిపిన సినిమాను తీసుకురాబోతున్నారు దర్శకుడు సంజీవ్ మేగోటి. వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది, కృష్ణ సాయి ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ కన్నడ వెర్షన్ టీజర్‌ను బెంగళూరులో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమం చిత్రబృందం, అతిథుల సందడితో హర్షాతిరేకంగా జరిగింది. ఈ వేడుకకు ‘దేవి’ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన నటి ప్రేమ, ‘దండుపాళ్యం’ ఫేమ్…

Read more
‘పోలీస్ కంప్లైంట్’లో వరలక్ష్మి శరత్ కుమార్ – నవీన్ చంద్ర జంట‌పై ల‌వ్ సాంగ్ Telugu News

‘పోలీస్ కంప్లైంట్’లో వరలక్ష్మి శరత్ కుమార్ – నవీన్ చంద్ర జంట‌పై ల‌వ్ సాంగ్

▪️ బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ "ప్రేమ ఓ ప్రేమ" ▪️ లాంచ్ చేసిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ప్ర‌భు ▪️ సంజీవ్ మేగోటి ద‌ర్శ‌క‌త్వంలో యాక్షన్ థ్రిల్లర్‌ సౌత్ ఇండియన్ టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్, వెర్సటైల్ యాక్టర్ నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై, బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ - నవీన్ చంద్ర జంట‌పై చిత్రీకరించిన బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ "ప్రేమ ఓ ప్రేమ" అనే పల్లవితో మొదలైన ప్రేమ గీతాన్ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ప్ర‌భు లాంచ్ చేశారు. ఈ పాట‌ అన్విక ఆడియోస్ ద్వారా రిలీజ్ అయింది. "ప్రేమ ఓ…

Read more
ఘనంగా ‘పోలీస్ కంప్లైంట్’ టీజర్ లాంచ్* Telugu News

ఘనంగా ‘పోలీస్ కంప్లైంట్’ టీజర్ లాంచ్*

సౌతిండియా హాట్ ఫెవరెట్ హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్‌ఫుల్ రోల్.. హీరోయిజంను ఫర్ఫెక్ట్ గా ప్లే చేసే హీరో నవీన్ చంద్ర పవర్ ఫుల్ రోల్ లో.. 52 మంది సీనియర్ ఆర్టిస్టులు.. హారర్ థ్రిల్లర్.. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా.. టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ ఫ్యాషనెట్ ఫిలిమ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరకేక్కిస్తున్న మూవీ ‘పోలీస్ కంప్లైంట్’. ఎమ్మెస్కె ప్రమిదశ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి రచన–దర్శకత్వంలో బాలకృష్ణ మహారాణా నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ తెలుగు, కన్నడ టీజర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్‌ఫుల్ యాటిట్యూడ్‌తో పాటు తొలిసారిగా ఫుల్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించారని…

Read more