Skip to content

‘ఎల్లమ్మ’ నుంచి పర్షిగా దేవి శ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్ రిలీజ్

విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాన్ని అందుకున్న ‘బలగం’ చిత్రం తర్వాత, జాతీయ అవార్డు గ్రహీత వేణు యెల్దండి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’ సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో, శిరీష్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం, బలమైన భావోద్వేగాలను, సాంస్కృతిక నేపథ్యాన్ని మిళితం చేస్తూ సాగుతుంది. ‘రాక్‌స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించడంతో పాటు హీరోగా పరిచయమౌతున్నారు. ఇది DSP కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవనుంది.

అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ‘ఎల్లమ్మ’ చిత్ర బృందం ఈ రోజు ‘పర్షి’గా దేవి శ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. DSP పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్, ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

ఈ ఫస్ట్ లుక్ ప్రత్యేకత సింప్లీసిటీ. ఈ మధ్యకాలంలో భారీ మాస్ పోస్టర్లు, ఓవర్ ది టాప్ ప్రెజెంటేషన్లు ఎక్కువగా కనిపిస్తున్న సమయంలో… ‘ఎల్లమ్మ’ టీమ్ మాత్రం పూర్తిగా భిన్నంగా ప్రజెంట్ చేసింది. సింపుల్ డ్రెస్ లో, చేతిలో కిరీటాన్ని పట్టుకుని ఎంతో సహజంగా నిలబడ్డ డీఎస్పీ లుక్‌లో అమాయకత్వం, నిజాయితీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే ఈ పోస్టర్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెట్టింది.

డీఎస్పీ కళ్లలో కనిపించే అమాయకత్వం ‘పర్షి’ పాత్రను ప్రేక్షకులకు వెంటనే దగ్గర చేస్తోంది. అన్ని భాషల ప్రేక్షకులు ఈ పాత్రతో కనెక్ట్ అయ్యేలా ఉండబోతోందనే సంకేతాలు ఫస్ట్ లుక్‌లో కనిపిస్తున్నాయి. తొలి సినిమానే అయినప్పటికీ, డీఎస్పీ ఈ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయిన తీరు దర్శకుడు వేణు ఎల్దండి విజన్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.

ఈ చిత్రంలో డీఎస్పీ కేవలం హీరోగానే కాకుండా సంగీత దర్శకుడిగానూ తనదైన ముద్ర వేయనున్నారు. ఎన్నో సంవత్సరాలుగా తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘ఎల్లమ్మ’ను మలిచిన వేణు, ‘బలగం’ తర్వాత మరోసారి ప్రేక్షకులను మనసులని తాకే కథతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

అనౌన్స్మెంట్, టైటిల్ గ్లింప్స్‌తోనే భారీ అంచనాలు నెలకొల్పిన ‘ఎల్లమ్మ’ పై ఈ ఫస్ట్ లుక్ మరింత ఆసక్తిని పెంచింది.

తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

నటీనటులు: దేవి శ్రీ ప్రసాద్

సాంకేతిక బృందం:
సమర్పణ: దిల్ రాజు
నిర్మాత: శిరీష్
రచన, దర్శకత్వం: ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.