నిఖిల్ ‘స్వయంభు’ 175 రోజుల షూటింగ్
నిఖిల్ సిద్ధార్థ్ ‘స్వయంభు’ సినిమాతో ప్రేక్షకులను చారిత్రక ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. మల్టీ లాంగ్వేజ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘స్వయంభు’ కోసం ఏకంగా 175 రోజుల పాటు షూటింగ్ నిర్వహించారు. ఫైనల్ ప్రొడక్ట్‌లో సుమారు 2,500 వీఎఫ్‌ఎక్స్ షాట్స్‌ను పొందుపరుస్తున్నారు. ఈ నెంబర్స్ సినిమా ఏ స్థాయిలో తెరకెక్కుతోందో, ఎంత భారీ టెక్నికల్ వర్క్ జరుగుతోందో తెలియజేస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన బిహైండ్ ది సీన్స్ పిక్చర్ సినిమా మేకింగ్‌పై…
