Skip to content

విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘తెలుసా తెలుసా’ గీతం విడుదల

శ్రీమతి కె. శ్రీదేవి సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్న చిత్రం ‘తెల్ల కాగితం’. హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు నందు సవిరిగాన అందిస్తున్నారు. ఈ మూవీకి రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్ అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.

తాజాగా ఈ మూవీ నుంచి ‘తెలుసా తెలుసా’ అంటూ సాగే ఓ మెలోడీ గీతాన్ని సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ఈ పాటకు సురేష్ బనిశెట్టి సాహిత్యం.. అనుదీప్ దేవ్, లిప్సిక గాత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక విజయ్ బుల్గానిన్ ఇచ్చిన మెలోడీ ట్యూన్‌ను మనసుని హత్తుకునేలా ఉంది. లిరికల్ వీడియో ఎంతో అందంగా కనిపిస్తోంది. హీరో, హీరోయిన్ల జంట.. వారిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు ఈ పాటకు అదనపపు ఆకర్షణ కానున్నాయి.

ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రఫర్ కె.వి గుహన్ కెమెరామెన్‌గా, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. అక్టోబర్ 2న గ్రాండ్‌గా ఈ ఈ మూవీని విడుదల చేయబోతోన్నారు.

తారాగణం: హర్ష్ రోషన్, నక్షత్ర, దీపక్, అజయ్ తదితరులు

సాంకేతిక సిబ్బంది
దర్శకుడు: రమేష్ బండ్రెడ్డి
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: నందు సవిరిగాన
సమర్పణ: శ్రీమతి కె. శ్రీదేవి
బ్యానర్: అరుణాచల క్రియేషన్స్
నిర్మాత: కృష్ణ కొమ్మాలపాటి
సంగీత దర్శకుడు: విజయ్ బుల్గానిన్
DOP: K.V.గుహన్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ప్రొడక్షన్ డిజైన్: చిన్నా
కొరియోగ్రాఫర్: ఈశ్వర్ పెంటి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవి సూర్నెడ్డి
సంగీతం: విజయ్ బుల్గానిన్
సాహిత్యం: సురేష్ బనిశెట్టి
గానం: అనుదీప్ దేవ్, లిప్సిక
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్
PRO: వంశీ కాకా
పబ్లిసిటీ డిజైనర్: దివా పెద్దవీటి
మ్యూజిక్ లేబుల్: సరిగమ

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.