తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ గా మోహన్ వడ్లపట్ల
▪️ఉపాధ్యక్ష పదవికి నలుగురు పోటీ పడగా మోహన్ వడ్లపట్లకు అత్యధిక మెజార్టీ ▪️ ‘మన ప్యానెల్’ ప్రభంజనం హైదరాబాద్: తెలుగు చిత్ర నిర్మాతల మండలి (TFPC) 2026 ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్ష (వైస్ ప్రెసిడెంట్) పదవి కోసం నలుగురు అభ్యర్థులు—మోహన్ వడ్లపట్ల, జీవిత, దామోదర్ ప్రసాద్, భరత్ చౌదరి పోటీ పడ్డారు. వీరిలో ‘మన ప్యానెల్’ తరఫున నిలబడిన మోహన్ వడ్లపట్ల అందరికంటే అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఎగ్జిక్యూటివ్ కమిటీకి సంబంధించి మొత్తం 15 స్థానాల్లో ‘మన ప్యానెల్’కు చెందిన 12 మంది అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తంగా నిర్మాతల మండలి ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ ఆధిపత్యం స్పష్టంగా కనిపించగా, నలుగురి…
