బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న నటుడు రమేష్ కుటుంబానికి అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి
తోటి కళాకారుల కష్టసుఖాల్లో ఎప్పుడూ ముందుండే మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ‘గబ్బర్ సింగ్’ చిత్రంతో పాటు పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన నటుడు రమేష్ గారు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న చిరంజీవి గారు వెంటనే స్పందించారు. అపోలో ఆసుపత్రిలో డాక్టర్ సుబ్బారెడ్డి గారితో తరచుగా మాట్లాడుతూ రమేష్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న చిరంజీవి గారు, చికిత్సకు అవసరమైన అన్ని విధాల సహాయం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, చికిత్స ఖర్చులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో ఆయన సతీమణి గారుకి తన తరఫున ₹3 లక్షల…
