న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల…
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌తో మంచు మనోజ్, మౌనిక భేటీ
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్, ఆయన సతీమణి మౌనిక భూమా మంచు తమ వ్యాపార ప్రస్థానాన్ని మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా వీరిద్దరూ న్యూఢిల్లీలోని హిమాచల్ సదన్‌లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ కవిందర్ గుప్తాను కలిశారు.
ఈ సందర్భంగా సినిమా, స్పోర్ట్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. వినోద రంగంతో పాటు క్రీడా రంగంలోనూ కొత్త అవకాశాలను అన్వేషిస్తున్న మంచు మనోజ్, మౌనిక భూమా మంచు.. తమ వ్యాపార దృష్టిని మరింత విస్తరించే దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం చర్చించిన ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు. దీంతో ఈ భేటీ వెనుక ఉన్న అసలు ప్రణాళికలపై ఆసక్తి నెలకొంది. సినిమా నిర్మాణం, స్పోర్ట్స్‌కు సంబంధించిన మౌలిక వసతులు, క్రీడా అవకాశాలు వంటి విభాగాల్లో పెద్ద స్థాయి ప్రాజెక్టులపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.
తమ విజన్‌లో భాగంగా కొత్త అవకాశాలను పరిశీలిస్తున్న మనోజ్, మౌనిక.. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఈ భేటీ వారి భవిష్యత్ వ్యాపార ప్రణాళికలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయనే దానిపై ఆసక్తిని పెంచుతోంది.
మరోవైపు మంచు మనోజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నటుడిగా విభిన్న కథాంశాలను ఎంచుకుంటున్న మనోజ్ ప్రస్తుతం ‘డేవిడ్ రెడ్డి’, ‘NBK11’లో నందమూరి బాలకృష్ణతో కలిసి, గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘రక్షక్’, ‘వడ్డీకాసులవాడ’ చిత్రాల్లో నటిస్తున్నారు.
మంచు మనోజ్ ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో కొత్త అవకాశాలను అన్వేషిస్తుండటంతో మంచు మనోజ్, మౌనిక భూమా మంచు తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.

