హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌తో మంచు మనోజ్, మౌనిక భేటీ
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్, ఆయన సతీమణి మౌనిక భూమా మంచు తమ వ్యాపార ప్రస్థానాన్ని మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా వీరిద్దరూ న్యూఢిల్లీలోని హిమాచల్ సదన్‌లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ కవిందర్ గుప్తాను కలిశారు. ఈ సందర్భంగా సినిమా, స్పోర్ట్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. వినోద రంగంతో పాటు క్రీడా రంగంలోనూ కొత్త అవకాశాలను అన్వేషిస్తున్న మంచు మనోజ్, మౌనిక భూమా మంచు.. తమ వ్యాపార దృష్టిని మరింత విస్తరించే దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చర్చించిన ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు. దీంతో ఈ భేటీ వెనుక ఉన్న అసలు ప్రణాళికలపై ఆసక్తి నెలకొంది…
