Skip to content

కాశీ మజిలీ ఈటీవీ విన్ లో 13న స్ట్రీమింగ్

కాశీ మజిలీ – చాలా సంవత్సరాల తర్వాత నటి రేణు దేశాయ్ నటించిన కాశీ మజిలీ వెబ్ ఎపిసోడ్ ట్రైలర్ రిలీజ్ అయింది. చాలా సంవత్సరాల తర్వాత కనిపించినా చాలా ఫ్రెష్ గా, అందంగా, మంచి నటనతో ట్రైలర్ లో రేణు దేశాయ్ నటన ఆకట్టుకుంటుంది. జె కె ఆర్ట్స్ బ్యానర్ పై జగదీష్ కుమార్ కాళ్ళూరు నిర్మించిన ఈ వెబ్ ఎపిసోడ్ ని 600 యాడ్స్ కు పైగా దర్శకత్వం వహించిన యమునా కిషోర్ దర్శకత్వం వహించారు. రేణు దేశాయ్ చాలా సంవత్సరాల తర్వాత కనిపించడం, అందంగా అద్భుతమైన నటన కనపరచడంతో ఈ ట్రైలర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ టీవీ విన్ లో ఈ ఆదివారం ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ కోసం రేణు దేశాయ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
బ్యానర్ : జె కె అర్ట్స్
దర్శకత్వం :యమునా కిశోర్
నిర్మాత :కాళ్ళూరు జగదీష్ కుమార్
కథ, చిత్రానువాదం , డైలాగ్స్ :రేణు దేశాయ్
కథానాయిక :రేణు దేశాయ్
కథానాయకుడు:శంకర్ ఇందుచూడన్
పాటల రచయిత :సిరివెన్నెల సీతారామశాస్త్రి
డైలాగ్స్ పర్యవేక్షణ :అబ్బూరి రవి
డి. ఓ. పి :రానా
సంగీతం:డా. జోశ్యభట్ల
ఎడిటర్ :మీర్ S
అసోసియేట్ డైరెక్టర్ (స్క్రిప్ట్) :ఆదిత్య గంగాధర్
అసోసియేట్ డైరెక్టర్ (షూట్ ఎగ్జిక్యూషన్) :హర్షవర్ధన్ సాధనాల

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.