Skip to content

‘కాళాంకి భైరవుడు’నుంచి ‘ఏంటో ఏమో’ పాట విడుదల

విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్ 'కాళాంకి భైరవుడు' ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చేతబడులు, క్షుద్ర పూజలు, నిజ జీవితంలో చోటుచేసుకున్న కొన్ని ఆశ్చర్యకర సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించనుంది. దర్శకుడు హరిహరన్.వి తన ప్రత్యేక కథన శైలితో ఈ చిత్రాన్ని రూపొందించారు. గాయత్రీ ప్రొడక్షన్స్, రాచమల్ల బ్రదర్స్ బ్యానర్లపై కె.ఎన్.రావు, డా. రాచమల్ల శ్రీనివాస రావు ఈ చిత్రాన్ని నిర్మించగా, పీ.ఆర్. సంగీతం సమకూర్చారు. ఇందులో రాజశేఖర్ వర్మ ప్రధాన పాత్రలో నటించగా, రితికా చక్రవర్తి, పూజ కిరణ్, భవ్యశ్రీ ఇతర కీలక పాత్రలను పోషించారు. ఇటీవల జరిగిన టీజర్ లాంచ్ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ ముఖ్య అతిథిగా…

Read more

‘లూసీ’ షూటింగ్ పూర్తి, టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ గా రాఘవేంద్ర పూజారి

విభిన్న కాన్సెప్ట్‌తో రూపొందుతున్న 'లూసీ' చిత్రానికి సంబంధించిన షూటింగ్ విజయవంతంగా పూర్తైంది. మైండ్-బెండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను సస్పెన్స్, థ్రిల్, ఊహించని మలుపులతో అలరించనుందని చిత్ర బృందం తెలిపింది. సైన్మా స్టూడియోస్ బ్యానర్‌పై రాఘవేంద్ర పూజారి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అండాలమ్మ పిక్చర్స్ సమర్పిస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఐటీ వరంగల్‌లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న రాఘవేంద్ర పూజారి, టాలీవుడ్‌లో అత్యంత చిన్న వయసులో చదువును కొనసాగిస్తూనే సినీ నిర్మాణ రంగంలో నిర్మాత గా కూడా తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించాలనే లక్ష్యంతో వరుస సినిమాలను నిర్మించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. యువతకు స్ఫూర్తిగా నిలిచేలా విద్యతో పాటు సినీ నిర్మాణాన్ని సమతూకంగా కొనసాగించాలని ఆయన సంకల్పించారు. మహదేవ్ చిరంజీవి కథ,…

Read more

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు రావడం ఎంతో గర్వకారణం – నిర్మాత ఫణి అడపాక

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో మా 'కమిటీ కుర్రోళ్లు' చిత్రానికి *ఉత్తమ తెలుగు చిత్రం (Best Telugu Film)*తో పాటు ఉత్తమ మేకప్ (Best Makeup) విభాగాల్లో రెండు జాతీయ అవార్డులు లభించడం పట్ల నిర్మాత ఫణి అడపాక హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "'సిద్ధార్థ్ రాయ్' సినిమాతో నిర్మాతగా నా ప్రయాణాన్ని ప్రారంభించాను. తొలి సినిమాతో ఎంతో విలువైన అనుభవాన్ని సొంతం చేసుకున్నాను. ఆ తర్వాత పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్తో కలిసి 'కమిటీ కుర్రోళ్లు' వంటి మంచి కథ, బలమైన భావోద్వేగాలు కలిగిన చిత్రాన్ని నిర్మించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజు అదే చిత్రం 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు…

Read more

‘వ్యూ: ది పాయింట్ ఆఫ్ వ్యూ’ టీజర్ లాంచ్

మహేష్ కాంపెల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వ్యూ: ది పాయింట్ ఆఫ్ వ్యూ' చిత్ర టీజర్‌ను చిత్రబృందం నేడు ఘనంగా విడుదల చేసింది. మిస్టరీ, సస్పెన్స్, ఎమోషనల్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కార్తికేయ సమర్పణలో పరవాణి చలనచిత్ర బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం విభిన్నమైన కథనంతో తెరకెక్కుతోంది. "ది పాయింట్ ఆఫ్ వ్యూ" అనే ట్యాగ్‌లైన్‌నే కథలోని ప్రధాన అంశాన్ని ప్రతిబింబిస్తోంది. టీజర్ విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ ఘనంగా మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా... నిర్మాత సత్య చౌదరి మాట్లాడుతూ.. "మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను వృత్తిరీత్యా కాంట్రాక్టర్‌ని. కానీ సినిమాలపై ఉన్న ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చాను. దాదాపు పదేళ్ల…

Read more
MRP సినిమా  టీజర్ విడుదల Telugu News

MRP సినిమా టీజర్ విడుదల

ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా ఈ టీజర్ విడుదల కావడం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. టీజర్ విడుదల చేసిన అనంతరం టీం అందరికి విషెస్ చెప్తూ మూవీ సక్సెస్ కావాలి, అని అన్నారు. పాంచజన్య ఫీచర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ చూస్తే వినోదంతో నిండిన వినూత్న కథను చూపించబోతుందనే భావన కలుగుతోంది. ముగ్గురు యువకుల చుట్టూ తిరిగే కథ, వారి మధ్య ఉండే సరదా సంఘటనలు, స్టైలిష్ మేకింగ్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ చిత్రానికి శ్రవణ్ జేష్ఠ దర్శకత్వం వహిస్తూ నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. టీజర్‌లో కనిపించిన ఎనర్జీ, ప్రెజెంటేషన్…

Read more
రాజేంద్ర ప్రసాద్ రిలీజ్ చేసిన ఆగాదం అనుకూలం  ట్రైలర్ Telugu News

రాజేంద్ర ప్రసాద్ రిలీజ్ చేసిన ఆగాదం అనుకూలం ట్రైలర్

ఐటీ కంపెనీ లో జాబ్ చేసుకుంటూ సినిమా మీద వున్న ప్యాషన్ తో అందరు కొత్త నటి నటులతో చేసిన ప్రయత్నం ఈ ఆగాదం అనుకూలం మూవీ, ఈ మూవీ ట్రైలర్ ని పద్మ శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు చూసి మూవీ టీమ్ కి తన శుభాకాంక్షలు తెలిపి భసవిష్యత్తు లో మరిన్ని సినిమాలు తీయాలని మూవీ టీమ్ ని అభినందించారు. ఈ మూవీ త్వరలో ప్రముఖ ఓ టి టి అమెజాన్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ కాబోతుంది అని మూవీ టీమ్ తెలీపింది అలాగే తెలుగు ప్రేక్షకులు మా మూవీ ని త్వరలో చూసి మా ప్రయాతన్ని సపోర్ట్ చేయవలిసింది గా కోరారు. తారాగణం: కియాన్,ప్రవీణ్,వినయ్,తిలక్,సౌందర్య లహరి,మధు వర్షిత,మధు…

Read more
“రుద్ర కాల” టైటిల్ ను రిలీజ్ చేసిన సమంత Telugu News

“రుద్ర కాల” టైటిల్ ను రిలీజ్ చేసిన సమంత

కన్నడ లో పలుచిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న స్టార్ హీరో దిగంత్ . తన కొత్త మూవీ టైటిల్ "రుద్ర కాల" ను స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేశారు అనంతరం సమంత మాట్లాడుతూ .. ఈ చిత్రం లో నటిస్తున్న దిగంత్ కు మరియు రుద్ర కాల మూవీ టీమ్ కు అభినందలు తెలిపారు ఈ మూవీ ఘనవిజయం సాధించాలని. ప్రేక్షకుల మనసు దోచుకోవాలని ఆశీర్వదించారు హీరో దిగంత్ మాట్లాడుతూ ,ఈ స్టోరీ నాకు మా డైరెక్టర్ గోపి గారు చెప్పినపుడు మొదటి సిట్టింగ్ లోనే ఒకే చేశాను... అలాగే మూవీ "రుద్ర కాల" టైటిల్ సమంత చేతులు మీదుగా రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది అలాగే మా డైరెక్టర్…

Read more
‘వేగ లీలా’ ఫస్ట్ లుక్ రిలీజ్ Telugu News

‘వేగ లీలా’ ఫస్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న వేగ లీల సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. పోస్టర్‌లో కనిపిస్తున్న డిజైన్, కలర్ టోన్ మరియు టైటిల్ స్టైలింగ్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఘంటసాల నాగ విశ్వనాథ్ రచించి, దర్శకత్వం వహిస్తున్నారు. స్ప్లాష్ కలర్ మీడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై, శ్రీ లక్ష్మి మణికర్ణిక ప్రొడక్షన్స్ ,జశ్రీత ప్రొడక్షన్స్ మరియు రితికా ఫిలిమ్స్ సంస్థలతో కలిసి ఈ చిత్రం రూపొందుతోంది. నిర్మాతలుగా సాయి కుమార్ మెడి మరియు జయ వేణు బాబు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు లో విడుదలకు సన్నాహాలకు ప్లాన్ చేస్తున్నారు . సంగీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. మరియు పవన్ చరణ్…

Read more
రేసుగుర్రం ఏప్రిల్ 8న గ్రాండ్‌గా  రీ-రిలీజ్ Telugu News

రేసుగుర్రం ఏప్రిల్ 8న గ్రాండ్‌గా రీ-రిలీజ్

టాలీవుడ్‌లో భారీ విజయాన్ని సాధించిన రేసుగుర్రం సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రీ-రిలీజ్ ట్రైలర్ విడుదల అయ్యింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా యాక్షన్, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ కలయికతో అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికీ ఈ చిత్రానికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ట్రైలర్‌తో మళ్లీ ఆ పాత మాస్ ఫీల్‌ను ప్రేక్షకులు అనుభవించబోతున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా, బ్రహ్మానందం తన కామెడీతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. క్రౌన్ మూవీస్ ద్వారా ఏప్రిల్ 8, 2026న గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమా, బన్నీ ఫ్యాన్స్‌కు బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను మరింత గ్రాండ్‌గా మార్చనుంది…

Read more
గుంటూరులో ప్రారంభమైన స్టూడియోస్ 81 సినిమాస్ Telugu News

గుంటూరులో ప్రారంభమైన స్టూడియోస్ 81 సినిమాస్

నగర నడిబొడ్ల సినిమా ధియేటర్ల ప్రారంభం 4 కే లేజర్ ప్రొటెక్షన్, యాక్సిడెంట్ యాక్స సి సిల్వర్ స్క్రీన్ లతో అధునాతమైన హంగులతో గుంటూరు నడిబొడ్డున ఉగాది పండుగ సందర్భంగా స్టూడియో 81 సినిమాస్ నూతన థియేటర్లో ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రేక్షకుల ఆహ్లాదమే ముఖ్యమైన అంశంగా స్టూడియో 81 సినిమాస్ థియేటర్లను సిద్ధం చేసిందన్నారు. మొత్తం ఐదు స్క్రీన్ లలో 849 సీట్ల కెపాసిటీతో అధునాతన హంగులతో నగర ప్రజలకు థియేటర్ అందుబాటులోకి వచ్చాయని కుటుంబ సమేతంగా సినిమాలను చూసి ఆనందభర్తంగా ఉండాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా అమెరికా నుండి తెచ్చిన తాజా నబ్రస్క మొక్కజొన్న అనేక రకమైన రుచికరమైన మసాలా దినుసులతో సినిమా చూసే వారికి పాప్కాన్ అనుభవానిస్తుందన్నారు…

Read more