Skip to content

‘కాళాంకి భైరవుడు’నుంచి ‘ఏంటో ఏమో’ పాట విడుదల

విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్ ‘కాళాంకి భైరవుడు’ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చేతబడులు, క్షుద్ర పూజలు, నిజ జీవితంలో చోటుచేసుకున్న కొన్ని ఆశ్చర్యకర సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించనుంది. దర్శకుడు హరిహరన్.వి తన ప్రత్యేక కథన శైలితో ఈ చిత్రాన్ని రూపొందించారు.

గాయత్రీ ప్రొడక్షన్స్, రాచమల్ల బ్రదర్స్ బ్యానర్లపై కె.ఎన్.రావు, డా. రాచమల్ల శ్రీనివాస రావు ఈ చిత్రాన్ని నిర్మించగా, పీ.ఆర్. సంగీతం సమకూర్చారు. ఇందులో రాజశేఖర్ వర్మ ప్రధాన పాత్రలో నటించగా, రితికా చక్రవర్తి, పూజ కిరణ్, భవ్యశ్రీ ఇతర కీలక పాత్రలను పోషించారు. ఇటీవల జరిగిన టీజర్ లాంచ్ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ ముఖ్య అతిథిగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు అని తెలిసిందే.

తాజాగా ఈ చిత్రం నుంచి “ఏంటో ఏమో” అనే మెలోడీ పాటను విజయవాడలో ఘనంగా విడుదల చేశారు. విజయవాడ ఎంజీ రోడ్డులోని లైలా మాల్‌లో ఉన్న INOX థియేటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి చిత్రబృందం హాజరై అభిమానులు, ప్రేక్షకుల సమక్షంలో పాటను ఆవిష్కరించింది. ఈ వేడుకకు మంచి స్పందన లభించగా, చిత్రబృందం సినిమా విశేషాలను పంచుకుంటూ ప్రేక్షకుల అభిమానానికి కృతజ్ఞతలు తెలిపింది.

అనంతరం కార్యక్రమంలో…

ప్రొడ్యూసర్ రాచమల్ల శ్రీనివాస రావు గారు మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం, మా సినిమా కాన్సెప్ట్ బ్లాక్ మేజిక్, ఈ సినిమా మీ అందరకి నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. థాంక్ యూ”.

దర్శకుడు హరిహరన్ వి మాట్లాడుతూ.. “ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. విజయవాడ అనేది ఒక ఎమోషన్. అందుకే మా సినిమా సాంగ్ లాంచ్‌ను ఇక్కడ నిర్వహిస్తున్నాం.
‘కాళాంకి భైరవుడు’ సినిమా ప్రతి ఒక్కరికీ తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది. కాష్మోరా సినిమా ఇక్కడ ఎంతమంది చూశారో తెలియదు.

అయితే ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారి నటనకు ఎంతటి ప్రశంసలు దక్కాయో, అదే స్థాయిలో మా సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపు వస్తుందని నమ్ముతున్నాను. మా తొలి పాట “పద పద” కు మీరు అందించిన ఆదరణలాగే, ఇప్పుడు విడుదలైన ‘ఏంటో ఏమో’ పాటను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఒక విషయం మాత్రం కచ్చితంగా చెబుతాను. లెనిన్ సినిమాలో ‘భారతమ్మ’ పాత్రను ప్రేక్షకులు ఎంతకాలం గుర్తుంచుకున్నారో, మా సినిమాలో ‘శ్రీదేవి’ పాత్రను కూడా అంతే ప్రేమగా గుర్తుంచుకుంటారు. నన్ను నమ్మి ఈ అవకాశాన్ని ఇచ్చిన మా నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు. వారు నాకు తండ్రిలాంటి వారు.

ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను. మిగతా విశేషాలన్నీ ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మీతో పంచుకుంటాం. ధన్యవాదాలు.”

హీరో రాజశేఖర్ వర్మ మాట్లాడుతూ, “విజయవాడ అంటే నాకు చాలా ఎమోషన్. నేను ఇక్కడే చదువుకున్నాను. అందుకే ఈ నగరంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. సినిమా పరిశ్రమలో నిర్మాతల సపోర్ట్ లేకుండా మంచి సినిమాలు రావు. ఇలాంటి నిర్మాతలు మరిన్ని మంచి చిత్రాలను నిర్మిస్తూ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, దర్శకుడు హరిహరన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

దర్శకుడు హరిహరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ పేరు రాబోయే రోజుల్లో ఇండస్ట్రీలో మారుమోగుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. ఆయన ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. నేను సినిమా చూశాను. ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చేసినా, ఈ సినిమా నాకు చాలా స్పెషల్. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నా పాత్రను ఎంతో కొత్తగా, ప్రత్యేకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు తొలి బ్లాక్‌బస్టర్ టాక్ విజయవాడ నుంచే వస్తుందనే నమ్మకం నాకు ఉంది. థాంక్యూ!”

హీరోయిన్ రితికా చక్రవర్తి మాట్లాడుతూ.. “నాకు తెలుగు చాలా బాగా వచ్చు. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చి మా సినిమాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా మొదటి పాటకు మీరు అందించిన ఆదరణలాగే, ఈ కొత్త పాటను కూడా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పాటను కూడా రీల్స్ ద్వారా వైరల్ చేసి మరింత మంది ప్రేక్షకులకు చేరేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా దర్శకుడు హరి గారు ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.

అలాగే ఈ చిత్రానికి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాం. చివరిగా… విజయవాడ… వీ లవ్ యూ! లవ్ అస్ బ్యాక్… ప్లీజ్!”

నటినటులు : రాజశేఖర్ వర్మ, రితికా చక్రవర్తి, పూజ కిరణ్, భవ్యశ్రీ, తదితరులు.

టెక్నికల్ టీం:

డైరెక్టర్ : హరి హారన్.వ్
ప్రొడ్యూసర్స్ : K.N రావు, రాచమల్ల శ్రీనివాస రావు
బ్యానర్ : గాయత్రీ ప్రొడక్షన్స్, రాచమల్ల బ్రదర్స్
మ్యూజిక్ : పీ అర్
డీ ఓ పీ : అశోక్
పీ అర్ ఓ : దినేష్ కోయ

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.