Skip to content

‘418’ సినిమా ట్రైలర్ రిలీజ్

పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ‘418’తో డార్కర్ జానర్ లో అడుగుపెడుతోంది. సీరియస్, అన్‌సెటిలింగ్ నెరేటివ్‌తో భయాన్ని కొత్త కోణంలో చూపించబోతున్న ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ఈ సినిమాతో కీర్తన్ నాదగౌడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కథను కూడా ఆయనే రాశారు. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైత్ర ఆచార్, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఓ పాడుబడిన ఇంట్లోకి ఒక్క పక్షి కూడా వెళ్లలేదని వాచ్‌మెన్ చెప్పడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అనంతరం 18 ఏళ్ల వివేక్ పాత్రను పరిచయం చేశారు. అతను రియాలిటీకి, హ్యాలుసినేషన్స్‌కి మధ్య చిక్కుకున్నట్లు చూపించారు. 15 ఏళ్లుగా మూసి ఉన్న బిల్డింగ్‌ను స్థానికుల వ్యతిరేకత ఉన్నప్పటికీ తిరిగి తెరుస్తారు. అయితే రూమ్ నంబర్ 418లో భయంకరమైన రహస్యం దాగి ఉంటుంది. దేవిక ఎంట్రీతో అసలైన భయం మొదలవుతుంది.

ట్రైలర్ ప్రారంభంలో రియాలిటీ, ఇమాజినేషన్ మధ్య చిక్కుకున్న యువకుడి చుట్టూ తిరిగే సైకలాజికల్ థ్రిల్లర్‌లా అనిపించినప్పటికీ.. ఆ తర్వాత కథ భయానక మలుపు తీసుకుంటుంది. సెకండాఫ్‌లో హారర్, సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్‌తో కూడిన హారర్ ప్రపంచాన్ని ఆవిష్కరించారు. ఒక్కో సీక్వెన్స్‌తో ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ వెన్నులో వణుకు పుట్టించేలా, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా డిజైన్ చేశారు. దర్శకుడు కీర్తన్ కథనాన్ని ఫోకస్డ్‌గా, గ్రిప్పింగ్‌గా నడిపించారు. అనవసరమైన కామెడీ, డిస్ట్రాక్షన్స్, కమర్షియల్ డీవియేషన్స్ లేకుండా నిజంగా భయపెట్టే సన్నివేశాలతో ట్రైలర్‌ ను ప్రజెంట్ చేశారు.

చైత్ర ఆచార్ ట్రైలర్‌లో బిగ్గెస్ట్ హైలైట్‌గా నిలిచారు. హాంటింగ్, స్పైన్-చిల్లింగ్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఆమె టెరిఫయింగ్ స్క్రీన్ ప్రెజెన్స్, భయానకమైన యాక్ట్స్ ట్రైలర్‌లో అసలైన భయాన్ని పుట్టిస్తాయి. సెకండాఫ్‌లో ఆమె ఎంట్రీ ఇచ్చిన క్షణం నుంచి కథ మొత్తం ఆమె చుట్టూ తిరుగుతుంది. సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్ పోషించిన ఇతర కీలక పాత్రలు ట్రైలర్‌లో కీలకంగా కనిపించాయి.

దినేష్ దివాకర్ సినిమాటోగ్రఫీ హారర్ వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. జాగ్రత్తగా రూపొందించిన కెమెరా యాంగిల్స్ సస్పెన్స్, భయాన్ని మరింత పెంచాయి. వెంకీ జీజీ హాంటింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టెన్షన్‌ను మరింత ఎలివేట్ చేసింది. భయపెట్టే సన్నివేశాలను మరింత ఇంపాక్ట్‌ఫుల్‌గా మార్చింది. ఉల్లాస్ హైదూర్ ప్రొడక్షన్ డిజైన్‌ భయానకంగా రూపొందించిన హాంటెడ్ హౌస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ హౌస్ కూడా కథలో ఒక క్యారెక్టర్‌లా కనిపిస్తోంది. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్‌గా ఉన్నాయి.

ట్రైలర్ హారర్, మిస్టరీతో కూడిన బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. అట్మాస్ఫెరిక్ విజువల్స్, చిల్లింగ్ పెర్ఫార్మెన్స్, హాంటింగ్ స్కోర్, సూపర్‌నేచురల్ థ్రిల్స్‌తో ‘418’ గ్రిప్పింగ్ హారర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతుంది. సెప్టెంబర్ 18న విడుదల కానున్న ఈ సినిమాపై ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది.

నటీనటులు: చైత్ర ఆచార్, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: కీర్తన్ నాదగౌడ
నిర్మాతలు: నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
సమర్పణ: ప్రశాంత్ నీల్
సంగీతం: వెంకీ జీజీ
సినిమాటోగ్రఫీ: దినేష్ దివాకర్
ప్రొడక్షన్ డిజైనర్: ఉల్లాస్ హైదూర్
పీఆర్ఓ: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.