Skip to content

‘418’ జూలై 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక హారర్ థ్రిల్లర్ '418' విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్న ఈ చిత్రాన్ని జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. బ్లాక్‌బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి కీర్తన్ నడగౌడ కథ, దర్శకత్వం వహించారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న '418', హారర్ త్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆరంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టేలా సరికొత్త హారర్ అనుభూతిని అందించబోతోంది…

Read more
418  టైటిల్‌ ఫిక్స్‌ Telugu News

418 టైటిల్‌ ఫిక్స్‌

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కొలాబరేషన్ లో యంగ్ స్టర్స్ తో కలసి సరికొత్త హర్రర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్నారు. సూర్య రాజ్ వీరబత్తిని, హను రెడ్డి, ప్రీతి పగడాల ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి టైటిల్ 418 అనే ఇంట్రస్టింగ్ టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. టైటిల్ పోస్టర్ సినిమా కథపై క్యూరియాసిటీ పెంచింది. భయంతో కూడిన గ్రామంలోని మెడికల్ కాలేజ్‌లో నేపధ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. సైన్స్– మిస్టరీ, సైన్స్, మూఢనమ్మకానికీ అర్ధం కాని ఒక…

Read more