మైత్రి మూవీ మేకర్స్ ‘418’ సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్
ఇటీవలే సంచలన బ్లాక్‌బస్టర్ 'ఇరుముడి'ని అందించిన పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స, '418'తో థియేటర్లకు ఒక విభిన్నమైన హారర్ చిత్రాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ఈ చిత్రంతో కీర్తన్ నాడగౌడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ఆయనే కథను కూడా అందించారు. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ థ్రిల్లర్ సెన్సార్‌తో సహా అన్ని లాంఛనాలను పూర్తి చేసుకుని 'ఎ' సర్టిఫికేట్‌ను పొందింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది. పోస్టర్ లో మసక వెలుతురులో…
