Skip to content

సెప్టెంబర్ 24న విడుదల కానున్న నాని ది ప్యారడైజ్

న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న విడుదల కానుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఈ సినిమా ప్రీమియర్లు సెప్టెంబర్ 23న జరగనున్నాయి. ఈ చిత్ర నిర్మాణ పనులు పూర్తిగా పూర్తయ్యాయి. పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి.

‘ది ప్యారడైజ్’ నుంచి నాని కొత్త పవర్‌ఫుల్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాని స్ట్రైకింగ్ లుక్‌తో పాటు ఈ ఫొటో వెనుక ఉన్న ఆసక్తికరమైన మేటర్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పిక్ శ్రీకాంత్ ఓదెల మొబైల్ ఫోన్‌లోని స్క్రీన్‌షాట్ కావడం విశేషం.

నాని రగ్గడ్ పీరియడ్ లుక్‌లో కనిపిస్తున్నారు. పొడవాటి జడలు, ఒత్తైన గడ్డం, రఫ్ అండ్ డార్క్ కాస్ట్యూమ్‌లో ఆయన లుక్ ఆకట్టుకుంటోంది. చేతిలో భారీ తుపాకీ పట్టుకుని, ఇంటెన్స్ చూపుతో ముందుకు చూస్తున్నారు. నోట్లో జడలు ఉండటం ఆయన క్యారెక్టర్‌లోని రా అండ్ ఎర్తీ అప్పియరెన్స్‌కు మరో లేయర్‌ను యాడ్ చేస్తోంది.

ఇప్పటికే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ సినిమా జోరు కనిపిస్తోంది. నార్త్ అమెరికా బుకింగ్స్ నిన్న ప్రారంభం కాగా, టికెట్ సేల్స్ ద్వారా సినిమా ఇప్పటికే 150K డాలర్లను దాటింది. ఈ స్ట్రాంగ్ రెస్పాన్స్‌తో ‘ది ప్యారడైజ్’ భారీ ఓపెనింగ్ సాధిస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి.

సాంగ్స్, ప్రమోషనల్ కంటెంట్‌కు భారీ రెస్పాన్స్ రావడంతో.. ఈ పీరియడ్ యాక్షన్ స్పెక్టాకిల్ అన్ని భాషల్లోనూ భారీ థియేట్రికల్ హైప్‌ను సొంతం చేసుకుంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.