Skip to content

ఈ నెల 18 న విడుదల కానున్న ఎమోషనల్ థ్రిల్లర్ “మిస్సింగ్ మేఘన”

ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వంలో వస్తున్న సినిమా మిస్సింగ్ మేఘన సుమారు 150 థియేటర్స్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులు ముందుకు వస్తున్న చిత్రం మిస్సింగ్ మేఘన . ఇప్పటి వరకూ రిలీజ్ అయిన 3 మాటలకు ఆడియన్స్ నుండి విశేష స్పందన వచ్చింది…. డిజిటల్ మీడియా లో అయితే ఈ పాటలు బాగా వైరల్ అవుతున్నాయి…

ధృవన్ అందించిన సంగీతం చాలా బావుంది…చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంది అంటున్నారు… ముఖ్యంగా శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ గురించి ఎక్కువ గా చెబుతున్నారు…అలాగే ఇప్పటి వరకూ 3 పాటలు , టీజర్ రీలిజ్ చేయడం జరిగింది…త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేస్తాం అని చేనున్నారు దర్శకులు వాచస్పతి…కంటెంట్ బాగా వచ్చింది.ఇక బిజినెస్ పరం గా హ్యాపీ అని చెబుతున్నారు నిర్మాత నరేష్

ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది …
తరువాత సినిమా నుంచి ఫస్ట్”సింగిల్ పిల్ల పిల్ల పిల్ల లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదుగా లాంచ్ అయ్యింది. అలాగే 2 వ పాట ను నిర్మాత దిల్ రాజు గారు రిలీజ్ చేశారు…3 వ పాటను ప్రముఖ రైటర్ , నిర్మాత కోన వెంకట్ మరియు మచ్చ రవి రిలీజ్ చేయడం జరిగింది.

థ్రిల్లర్ సినిమాలు ఇప్పటికీ చాలా వచ్చాయి…ఇక తరువాత కూడా వస్తాయి..కానీ *మిస్సింగ్ మేఘన * మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది అని మాత్రం చెప్పగలను… ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి…మా 2 ఏళ్ల ఫ్యూచర్ పెట్టీ ఇలా వచ్చి ..అలా వెళ్ళే సినిమా అయితే మేము చేయలేదు… క్లైమాక్స్ లో వచ్చే హుక్ పాయింట్ కి అందరూ షాక్ అవుతారు..ఇది నార్మల్ థ్రిల్లర్ కాదు ..ఇదో ఎమోషనల్ థ్రిల్లర్ అని చెబుతున్నారు దర్శకుడు వాచస్పతి…ఈ సినిమా మీద మాకు నమ్మకం ఉంది ..అందుకే ఒక పెద్ద నిర్మాణ సంస్థ మా సినిమా ను రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చింది.

క్యాస్ట్ :

రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య, గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు

టెక్నీకల్ టీం :
ప్రొడ్యూసర్: పంచుమర్తి నరేష్ బాబు
కో-ప్రొడ్యూసర్: దివెళా శ్రీనివాస్ రావ్
బ్యానర్ నేమ్స్: ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో
దర్శకత్వం: వాచస్పతి
కథ & స్క్రీన్‌ప్లే: వనరాజ్
సంభాషణలు: వెంకట్ బద్దిగం
సంగీతం: ఆర్.ఆర్.ధృవన్
ఛాయాగ్రహణం: శామ్. కె. నాయుడు
ఎడిటింగ్: బసవా
కొరియోగ్రాఫర్: జేడీ, ఈశ్వర్ పెంటి
ఫైట్స్: రామకృష్ణ, స్టంట్ శంకర్
లిరిక్స్: ఆర్.ఆర్. ధృవన్, అలరాజు
అడిషనల్ స్క్రీన్ ప్లే: శ్రీధర్ పరిగి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్:
మద్దినేని హరి కృష్ణ
కిషోర్ తోకల

పిఆర్వో: సోమిశెట్టి నాగేశ్వర రావ్ (SNR), తిరుమలశెట్టి వెంకటేష్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.