న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల…
త్రివిక్రమ్ సమర్పణలో “హనుమాన్ అంశ్” ఈ నెల 18న రిలీజ్
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి, రికార్డ్ స్థాయి వసూళ్లు అందుకుంటున్న “హనుమాన్ అంశ్” సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్. ఆయన సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని ఈ నెల 18న తెలుగులో థియేట్రికల్ రిలీజ్ చేస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు డా. విశాల్ చతుర్వేది “హనుమాన్ అంశ్” సినిమాను రూపొందించారు. రాగిని ఎస్, నమ్రత. జి. సింగ్, అనుప్రియ ఎ నగర్, డా.విశాల్ చతుర్వేది నిర్మించారు.
“హనుమాన్ అంశ్” సినిమాలో శోభిత్ శ్రీవాత్సవ, చందన్ ఆనంద్, పూర్ణిమ తివారి, విహాన్ షెగ్డే కీలక పాత్రల్లో నటించారు. గత నెల 7వ తేదీన బాలీవుడ్ లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 150 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండటం మరింతగా అంచనాలు పెంచుతోంది. తెలుగు ఆడియెన్స్ ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో తెలుగులో “హనుమాన్ అంశ్” సినిమా మంచి విజయం సాధిస్తుందనే ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి.

